Site icon Desha Disha

AP: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ

AP: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ

ప్ర­ధా­ని మోదీ నేడు కర్నూ­లు, నం­ద్యాల జి­ల్లా­ల్లో పర్య­టిం­చ­ను­న్నా­రు. ఢి­ల్లీ నుం­చి ఓర్వ­క­ల్లు వి­మా­న్రా­శ­యం చే­రు­కొ­ని అక్క­డి నుం­చి ప్ర­త్యేక హె­లి­కా­ప్ట­ర్‌­లో శ్రీ­శై­లం చే­రు­కుం­టా­రు. జ్యో­తి­ర్లిం­గం, శక్తి­పీ­ఠం క్షే­త్రా­ల­ను దర్శిం­చు­కుం­టా­రు. మల్లి­కా­ర్జు­న­స్వా­మి, భ్ర­మ­రాం­బిక దే­వి­కి ప్ర­త్యేక పూ­జ­లు ని­ర్వ­హి­స్తా­రు. అనం­త­రం శి­వా­జీ స్ఫూ­ర్తి కేం­ద్రా­న్ని సం­ద­ర్శి­స్తా­రు. శ్రీ­శై­లం­లో­ని ఘంటా మఠం­లో పు­రా­వ­స్తు శాఖ ప్ర­ద­ర్శిం­చిన 21 సె­ట్ల తా­మ్ర శా­స­నా­ల­ను, 53 రాగి రే­కు­ల­ను, నా­ణే­ల­ను తి­ల­కి­స్తా­రు. ఆ తర్వాత ప్ర­త్యేక హె­లి­కా­ప్ట­ర్‌­లో కర్నూ­లు నగర శి­వా­రున ఓర్వ­క­ల్లు మం­డ­లం నన్నూ­రు టో­ల్‌ ప్లా­జా దగ్గర రా­గ­మ­యూ­రి గ్రీ­న్‌­హి­ల్స్‌­కు చే­రు­కుం­టా­రు. అక్కడ ‘సూ­ప­ర్‌ జీ­ఎ­స్టీ- సూ­ప­ర్‌ సే­విం­గ్స్‌’ భారీ బహి­రంగ సభలో మోదీ పా­ల్గొం­టా­రు. రా­ష్ట్రం­లో కేం­ద్ర ప్ర­భు­త్వం­లో­ని వి­విధ శా­ఖ­లు రూ.13,429 కో­ట్ల­తో ని­ర్మిం­చ­ను­న్న 16 ప్రా­జె­క్టు­ల­కు ప్ర­ధా­ని శం­కు­స్థా­పన చే­య­ను­న్నా­రు. దే­శం­లో­నే జీ­ఎ­స్టీ-2.0పై అవ­గా­హన కల్పిం­చేం­దు­కు ని­ర్వ­హి­స్తు­న్న తొలి సభ ఇది. సీఎం చం­ద్ర­బా­బు, డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్‌, మం­త్రి లో­కే­శ్‌ సహా కేం­ద్ర, రా­ష్ట్ర మం­త్రు­లు, కూ­ట­మి పా­ర్టీల ప్ర­ముఖ నా­య­కు­లు హా­జ­రు­కా­ను­న్నా­రు. రా­ష్ట్ర ప్ర­భు­త్వం ప్ర­ధా­ని సభను ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా తీ­సు­కుం­ది. సభకు 3 లక్షల మం­ది­కి పైగా హా­జ­ర­య్యే­లా ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు.

ప్రభుత్వమంతా కర్నూలులోనే..

మం­త్రి­వ­ర్గం మొ­త్తం కర్నూ­లు­లో మకాం వే­సిం­ది. దా­దా­పు వంద మంది ఐఏ­ఎ­స్‌, ఐపీ­ఎ­స్‌ అధి­కా­రు­లు, రా­య­ల­సీమ జి­ల్లా­లు సహా ప్ర­కా­శం, గుం­టూ­రు జి­ల్లా­ల­కు చెం­దిన పలు­వు­రు ఎమ్మె­ల్యే­లు, వి­విధ కా­ర్పొ­రే­ష­న్ల చై­ర్మ­న్లు, టీ­డీ­పీ ము­ఖ్య నే­త­లు తమకు కే­టా­యిం­చిన బా­ధ్య­త­ల్లో ని­మ­గ్న­మ­య్యా­రు. మం­త్రు­లు ని­మ్మల రా­మా­నా­యు­డు, పయ్యా­వుల కే­శ­వ్‌, బీసీ జనా­ర్ద­న్‌­రె­డ్డి, టీజీ భర­త్‌, ఎన్‌­ఎం­డీ ఫరూ­క్‌, నా­రా­యణ, అచ్చె­న్నా­యు­డు, గొ­ట్టి­పా­టి రవి­కు­మా­ర్‌, సత్య­కు­మా­ర్‌, అన­గా­ని సత్య­ప్ర­సా­ద్‌, వం­గ­ల­పు­డి అనిత, రాం­ప్ర­సా­ద్‌, టీ­డీ­పీ రా­ష్ట్ర అధ్య­క్షు­డు పల్లా శ్రీ­ని­వా­స్‌, బీ­జే­పీ రా­ష్ట్ర అధ్య­క్షు­డు పీ­వీ­ఎ­న్‌ మా­ధ­వ్‌, మాజీ ఎంపీ టీజీ వెం­క­టే­శ్‌ తది­త­రు­లు ఏర్పా­ట్ల­ను పరి­శీ­లిం­చా­రు. ప్ర­ధా­ని మోదీ పర్య­ట­న­ను జయ­ప్ర­దం చే­యా­ల­ని మం­త్రు­లు, టీ­డీ­పీ, బీ­జే­పీ రా­ష్ట్ర నా­య­కు­లు వి­జ్ఞ­ప్తి చే­శా­రు. కర్నూ­లు­లో­ని ప్ర­భు­త్వ అతి­ఽ­థి గృ­హం­లో భారీ జన సమీ­క­ర­ణ­పై కర్నూ­లు, నం­ద్యాల జి­ల్లాల కూ­ట­మి పా­ర్టీల ము­ఖ్య నా­య­కు­ల­తో మం­త్రు­లు సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు.

Exit mobile version