ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన 93 ఏళ్ల వైద్యుడు వయసు ఒక నెంబర్ మాత్రమే.. పదవీ విరమణ అనేది జీవితం నుంచి కాదు, పని నుంచి మాత్రమే అని నిరూపించాడు. ఆరోగ్యకరమైన వృద్ధాప్య డాక్టర్ జాన్ లెవిన్ 93 ఏళ్ల వయస్సులో తండ్రి కావడం ద్వారా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. అయితే తాను ఇక్కడితో ఆగను అని .. మరింత మంది పిల్లలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
డాక్టర్ లెవిన్ 93 ఏళ్ళు.. అతని భార్య డాక్టర్ యాంగ్యింగ్ కి 37 ఏళ్లు. లెవిన్ కంటే భార్య 56 ఏళ్లు చిన్నది. ఇద్దరి మధ్య వయసు తేడా 56 ఏళ్లు. అంటే లెవిన్ భార్య వయస్సు అతని మనవరాలి వయస్సుతో సమానం. 2014లో లాస్ వెగాస్‌లో వివాహం చేసుకున్నారు. దంపతులు ఫిబ్రవరి 2024లో తమ కుమారుడు గ్యాబీని స్వాగతించారు. ఈ ప్రత్యేకమైన జంట ఇప్పుడు మరొక బిడ్డను స్వాగతించడానికి సిద్ధమవుతోంది.
మీడియా నివేదికల ప్రకారం లెవిన్ దంపతులు ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF), స్పెర్మ్ డొనేషన్ ద్వారా ఈ ఆనందాన్ని పొందుతున్నారు. డాక్టర్ లెనిన్ మాట్లాడుతూ “నేను ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలనుకుంటున్నాను” అని అన్నారు. తన కుమారుడు గ్యాబీ 21వ పుట్టినరోజున తాను .. తన కొడుకుతో ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
అయితే డాక్టర్ లెవిన్ కోరిక కనుక తీరితే.. కొడుక్కి 21వచ్చే సమయంలో డాక్టర్ లెవిన్ వయస్సు 116 సంవత్సరాలకు చేరుకుంటాడు. యూదు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం అయిన బార్ మిట్జ్వా ద్వారా గ్యాబీకి మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ఇది సాధారణంగా 13 సంవత్సరాల వయస్సులో జరుగుతుంది. ఈ వేడుక ఒక యూదు బాలుడు యుక్త వయస్సులోకి మారడాన్ని సూచిస్తుంది.
గ్యాబీ డాక్టర్ లెవిన్ కు నాల్గవ సంతానం. అతనికి మొదటి వివాహం ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరూ 60 ఏళ్ల వయసు వారు. అతనికి 10 మంది మనవరాళ్ళు , ఒక మునిమనవరాలు కూడా ఉన్నారు.
.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..