Site icon Desha Disha

సఖి లాంటి ఫ్యామిలీ మూవీ ‘డ్యూడ్’

సఖి లాంటి ఫ్యామిలీ మూవీ ‘డ్యూడ్’

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్‌’తో దీపావళికి ప్రేక్షకుల ముం దుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ’ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ. చాలా కొత్త కథలాగా అనిపిస్తుంది. అద్భుతమైన సన్నివేశాలు ఉంటాయి. అలాగే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. – డైరెక్టర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్మకంగా ఉంది. కథలో ఎంత కావాలో అంతే మోతాదులో ఇందులో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. డ్యూడ్ ఈ కథకు సరైన టైటిల్. – తమిళ్‌తో సమానంగా తెలుగులో ఈ సినిమా ఆడుతుందని నమ్మకం ఉంది. ఇది మన ఎమోషన్స్ కి తగ్గట్టుగా ఉండే సినిమా. ఇది యూత్‌తో పాటు ఫ్యామిలీ కూడా చూసే సినిమా. తప్పకుండా చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఇది సఖి లాంటి ఫ్యామిలీ మూవీ. చాలా యూత్‌ఫుల్ సన్నివేశాలు ఉంటాయి. ప్రస్తుతం మేము చేస్తున్న ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు రెండు కూడా 2026లో వస్తాయి. -పెద్ది సినిమా 2026 మార్చి 27న వస్తుంది. ఇక ఆంధ్ర కింగ్ -సినిమా చాలా బాగా వచ్చింది. రామ్‌కి చాలా డిఫరెంట్ మూవీ ఇది”అని అన్నారు. 

Exit mobile version