Site icon Desha Disha

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ..

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ..

కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఆయన భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని పూజించారు.ప్రత్యేకంగా, మల్లికార్జున స్వామికి పంచామృత రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల పూజ, కుంకుమార్చన పూజలు చేశారు.పూజల అనంతరం, ప్రధానమంత్రి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి, అక్కడి శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించారు.
ఈ సందర్శనలో ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీశైలం చేరుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

Exit mobile version