
దిశ, డైనమిక్ బ్యూరో: సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్ (Daggubati Venkatesh), రానా, అభిరామ్, సురేశ్ బాబుకు నాంపల్లి కోర్టు (Nampally Court) షాకిచ్చింది. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో వీరంతా తప్పనిసరిగా నవంబర్ 14న న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు కచ్చితంగా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నారు. ఈ అంశంలో గతంలో నమోదైన కేసుపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.