తాజాగా, ఓ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పండించిన 1064 కేజీల భారీ గుమ్మడికాయ.. అక్కడి పోటీలో విజేతగా నిలిచింది. అంతేకాదు.. ఏకంగా.. రూ. 18 లక్షల రూపాయల బహుమానాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ సారి కూడా కాలిఫోర్నియాలోని దక్షిణ శాన్‌ఫ్రాన్సిస్కోలో గల హాఫ్ మూన్‌బేలో 52వ వరల్డ్ ఛాంపియన్ షిప్ పంప్‌కిన్ వేఆఫ్ నిర్వహించారు. ఈ పోటీల్లో సాంట రోసాకు చెందిన ఇంజినీర్ బ్రాండన్ డ్వాసన్ భారీ సైజు గుమ్మడికాయను పండించి విజేతగా నిలిచాడు. ఆయన పండించి తెచ్చిన గుమ్మడికాయ బరువు ఏకంగా 1,064 కిలోలు. భారీ ఆకారంలో ఉ్న గుమ్మడి కాయ అక్కడి వారిని విశేషంగా ఆకర్షించింది. ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలో ఇంజినీర్ అయిన డ్వాసన్.. గత ఐదేళ్లుగా భారీ గుమ్మడికాయలు పండిస్తున్నాడు. ఇక, అతిపెద్ద గుమ్మడికాయను పండించినందుకు గాను డ్వాసన్.. 20 వేల డాలర్లు..అంటే మన డబ్బు లెక్క ప్రకారం.. సుమారు రూ. 18 లక్షలు గెలుచుకున్నాడు. అనంతరం డ్వాసన్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద గుమ్మడికాయను పండించడమే కాకుండా పోటీల్లో విజేతగా నిలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. నిరుడు కూడా ఈ పోటీలకి వచ్చినా.. 3 కిలోల తేడాతో తన గుమ్మడి కాయ ఓడిపోయిందని గుర్తుచేసుకున్నాడు. అమెరికాలో ఏటా ఏటా అక్టోబర్ నెలలో ఈ గుమ్మడికాయల వేడుకను ఘనంగా నిర్వహిస్తుంటారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు.. అమెరికాలోని ప్రజలు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ పోటీల్లో గెలుపొందిన గుమ్మడికాయకు.. ‘మిస్ పంప్‌కిన్’ అవార్డు అందజేస్తారు. అంతేకాకుండా, అతి బరువైన గుమ్మడికాయకు ప్రత్యేక బహుమతి ప్రకటిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భగ్గుమన్న బంగారం-తగ్గిన వెండిగురువారం ధరలు ఎలా ఉన్నాయి
Madhavan: 50 ప్లస్ లో దూకుడు చూపిస్తున్న మాధవన్
సీన్ రివర్స్.. టికెట్ రేట్లపై మళ్లీ బాంబు
వేలకోట్లకు అధిపతి.. అయినా సైకిల్‌పైనే సవారీ
భారత్‌లోనే రిచ్చెస్ట్ మహిళ రోష్ని.. ఆస్తి విలువ తెలిస్తే మైండ్ బ్లాకే