Site icon Desha Disha

రీతూ చౌదరి పై నోరు పారేసుకున్న దివ్వెల మాధురి!

రీతూ చౌదరి పై నోరు పారేసుకున్న దివ్వెల మాధురి!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ గత సీజన్ లో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అవినాష్,రోహిణి,టేస్టీ తేజ వంటి వాళ్ళు వచ్చి,తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించారు. అంతే కాకుండా అదే వైల్డ్ కార్డ్స్ క్యాటగిరీ లో వచ్చిన గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. గత సీజన్ లో వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్ అంత పెద్ద హిట్ అయ్యింది. కానీ ఈ సీజన్(Bigg Boss 9 Telugu) లో మాత్రం వైల్డ్ కార్డ్స్ రోత పుట్టిస్తున్నారు అనే చెప్పాలి. వీళ్ళు వచ్చిన తర్వాత గేమ్ రసవత్తరంగా మారుతుందని అనుకుంటే, రోజు రోజుకి ఆడియన్స్ కి పెద్ద సోది లాగా తయారైంది. ముఖ్యంగా దివ్వెల మాధురి అయితే హౌస్ మేట్స్ సహనం తోనే కాదు, ఆడియన్స్ సహనం తో కూడా ఒక రేంజ్ లో ఆడుకుంటుంది. నిన్న బిగ్ బాస్ హాట్ స్టార్ లైవ్ లో ఆమె రీతూ చౌదరి తో గొడవ పెట్టుకుంది.

ఇది ఈరోజు ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. అసలు జరిగిన గొడవ ఏమిటంటే, రాత్రులు అందరూ తొందరగా పడుకోవాలని, మీరు బెడ్ రూమ్స్ లో మాట్లాడుకుంటూ ఉండడం వల్ల నాకు రాత్రి నిద్ర డిస్టర్బ్ అయ్యి మూడు గంటల వరకు గార్డెన్ లో తిరుగుతున్నాను అని, ఇక నుండి ఎవరైనా బెడ్ రూమ్స్ లో పడుకునేముందు మాట్లాడితే అసలు ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్ హౌస్ మేట్స్ కి నచ్చలేదు. ముందుగా రీతూ చౌదరి మాట్లాడుతూ ‘బిగ్ బాస్ ఏమైనా రూల్ పెట్టాడా? మాట్లాడుకోవద్దని?’ అని అడుగుతుంది. అప్పుడు మాధురి లైట్స్ ఆపేది ఎందుకు?, నిద్రపొమ్మనే కదా? అని సమాధానం చెప్తుంది. ఇలా వీళ్లిద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారి తీస్తుంది. హౌస్ మేట్స్ అందరూ ఈ గొడవ చూసి కాస్త భయపడ్డారు. ఇలా జరగడం కొత్తేమి కాదు, ప్రతీ రోజు నాన్ స్టాప్ గా మాధురి కారణంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

Video Link : https://www.youtube.com/watch?v=BffChLbL2hM

అయితే హౌస్ లోకి వచ్చే ముందు ఈమె ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో రీతూ చౌదరి, ధర్మ మహేష్ వివాదం వ్యవహారం గురించి యాంకర్ ప్రస్తావించడంతో, మాధురి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నేను కూడా చూసాను, సీసీటీవీ వీడియోలను. ఆ అమ్మాయి ఎవరో అబ్బాయితో కలిసి లిఫ్ట్ దిగుతూ వస్తుంది’ అని అంటుంది. అప్పుడు యాంకర్ ఈ వివాదం గురించి రీతూ చౌదరి కి హౌస్ లోకి వెళ్లిన తర్వాత చెప్తారా అని అడగ్గా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘నేనెందుకు ఇలాంటివన్నీ చెప్తాను. అయినా ఒక అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను అలా బయటపెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళ మధ్య ఏ బంధం ఉంది అనేది క్లారిటీ లేనప్పుడు, ఒక అమ్మాయి మీద కేవలం ఒక్క వీడియో చూపించి ఇష్టమొచ్చిన అబాండాలు వేయడం అన్యాయం’ అంటూ చెప్పుకొచ్చింది.

Exit mobile version