The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas),మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రాజా సాబ్'(Raja Saab Movie) మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక హారర్ కామెడీ జానర్ లో ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నటించడం, ఆయన అభిమానులకు ప్రారంభం లో పెద్దగా నచ్చలేదు. భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా కొనాగుతున్న ప్రభాస్ కి ఇది సరైన సినిమా కాదు, వెంటనే ఆపేయండి అంటూ అప్పట్లో ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ట్రెండ్ కూడా చేశారు. కానీ సినిమా నుండి ఒక్కో ప్రమోషనల్ కంటెంట్ బయటకు వస్తుండడం, వాటిల్లో వింటేజ్ ప్రభాస్ మాస్ కనిపించడం తో ఫ్యాన్స్ ఇది తమ హీరో రేంజ్ కి తగ్గ సినిమానే అని ఫిక్స్ అయ్యి రిలాక్స్ అయ్యారు. ఇక రీసెంట్ గా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లను చూసి, కచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కానీ ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 11న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అప్పటికి గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 5 కి వాయిదా వేశారు. కానీ బయ్యర్స్ సంక్రాంతికి వస్తే బాగుంటుందని నిర్మాత విశ్వప్రసాద్ పై కాస్త ఒత్తిడి పెంచడం తో ఈ సినిమాని జనవరి 9న విడుదల చేయబోతున్నట్టు లేటెస్ట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ లో అధికారికంగా తెలిపారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఇంకా కాస్త ముందుకు జరిగినట్టు తెలుస్తుంది. సినిమాకు భారీ బడ్జెట్ పెట్టడం తో పాటు, అన్ని ప్రాంతాల్లోనూ భారీ లెవెల్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగడం తో సోలో రిలీజ్ కనీసం పది రోజులైనా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారట మేకర్స్.
మరి ప్రస్తుతం మేకర్స్ చేస్తున్న ఆలోచన ప్రకారం ఈ సినిమా ప్రీ పోన్ అవ్వబోతుందా?, లేదా ముందు చెప్పినట్టుగానే జనవరి 9 న విడుదల అవ్వబోతుందా అనేది చూడాలి. జనవరి 1న ఈ సినిమాని విడుదల చేయడం చాలా అంటే చాలా రిస్కీ. ఎందుకంటే ప్రీ ఫెస్టివల్ సమయం లో సినిమాల కలెక్షన్స్ చాలా డల్ గా ఉంటాయి. గతం లో ఇలా పవన్ కళ్యాణ్ బాలు, ఎన్టీఆర్ ఆంధ్రావాలా చిత్రాలు జనవరి 1 న విడుదలయ్యాయి. ఇప్పుడు ‘రాజా సాబ్’ కూడా ఆ డేట్ పై గురి పెట్టింది. ఈ చిత్రం తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది, చూడాలి మరి ఎవరు ఎవరిపై పై చెయ్యి సాధిస్తారు అనేది.