Site icon Desha Disha

యూనిబిక్‌ ఫుడ్స్‌ సీఈఓగా అజయ్‌ బతీజా

యూనిబిక్‌ ఫుడ్స్‌ సీఈఓగా అజయ్‌ బతీజా

– Advertisement –

హైదరాబాద్‌ : ప్రముఖ కుకీస్‌, బిస్కెట్లు, స్నాక్‌ ఉత్పత్తుల సంస్థ యూనిబిక్‌ ఫుడ్స్‌ తన కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా అజయ్‌ బతీజాను నియమించినట్టు ప్రకటించింది. ఆయన సంస్థ అభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపార విస్తరణకు దిశానిర్దేశం చేస్తారని యూనిబిక్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆయనకు బ్రాండ్‌ బిల్డింగ్‌, కస్టమర్‌ మార్కెటింగ్‌, ఫ్రాంచైజ్‌ లీడర్‌షిప్‌లో ఉన్న విశాల అనుభవం కంపెనీకి ఎంతో మేలు చేస్తుందని ఆ సంస్థ బోర్డు చైర్మెన్‌ సందీప్‌ రెడ్డి పేర్కొన్నారు.

– Advertisement –

Exit mobile version