Site icon Desha Disha

మరోసారి నోరు పారేసుకున్న డొనాల్డ్ ట్రంప్.. క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ – Telugu News | India TEARS INTO Trump’s False ‘Russian Oil’ Claim; MEA REVEALS ‘No Call Between Trump Modi’

మరోసారి నోరు పారేసుకున్న డొనాల్డ్ ట్రంప్.. క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ – Telugu News | India TEARS INTO Trump’s False ‘Russian Oil’ Claim; MEA REVEALS ‘No Call Between Trump Modi’

రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ నిలిపివేస్తుందన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలను భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ మధ్య బుధవారం (అక్టోబర్ 15) రోజున ఎలాంటి ఫోన్‌ సంభాషణ జరగలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

భారతదేశంపై అబద్దాలను ప్రచారం చేయడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారింది. రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు నిలిపివేస్తామని ప్రధాని మోదీ తనకు ఫోన్‌లో చెప్పారన్న ట్రంప్‌ వ్యాఖ్యల్లో నిజం లేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. భారత్‌లో ప్రతి ఏటా కొత్త నాయకత్వం పుట్టుకొస్తోందని, మోదీ తనకు ఆప్తమిత్రుడని అన్నారు ట్రంప్‌. రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులు నిలిపివేస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ట్రంప్‌కు కొత్తేమి కాదు. భారత్‌-పాక్‌ యుద్దాన్ని తానే ఆపినట్టు తరచుగా ప్రచారం చేసుకుంటున్నారు. రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను నిలిపివేస్తామని హామీ ఇచ్చారనడంలో ఏమాత్రం నిజం లేదు.

అయితే ట్రంప్‌ వ్యాఖ్యలను విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేయలేదని స్పష్టం చేసింది. అమెరికా నుంచి ఓ స్టేట్‌మెంట్‌ వచ్చింది. ఇంధనం దిగుమతిపై స్పష్టత ఇచ్చామని విదేశాంగశాఖ ప్రతినిధి రణదీప్‌ జైశ్వాల్‌ తెలిపారు. ఉదయం విడుదల చేసిన స్టేట్‌మెంట్‌కి కట్టుబడి ఉన్నామని, ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్‌ సంభాషణలు జరగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ట్రంప్‌ వ్యాఖ్యలపై రష్యా కూడా స్పందించింది. తమ చమురు దిగుమతులు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమని రష్యా స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపింది. భారత్‌-అమెరికా దౌత్య సంబంధాల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని రష్యా తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Exit mobile version