Silver Prices High: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మన ఇండియాలో వెండి ధరలు సైతం ఆకాశానికి పరిగెత్తుతున్నాయి. త్వరలో దీపావళి పండుగ సందర్భంగా ధన త్రయోదశి పర్వదినం రాబోతుంది. ఈ సందర్భంగా ఎంతోకొంత బంగారం కొనుగోలు చేయాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనాలా? వద్దా? అని చాలామంది అయోమయంలో ఉన్నారు. మరోవైపు అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది? భవిష్యత్తులో బంగారం తగ్గుతుందా? లేదా? అన్న అయోమయంలో ఉంటున్నారు. ఇటు వెండి ధరలు సైతం ఎక్కువమంది వెండి కొనుగోలు చేస్తున్నారు. అసలు వెండి పెరగడానికి కారణాలేంటి?
అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా.. అంటే అమెరికాలో డాలర్ విలువ తగ్గిపోతుండడం.. ప్రపంచవ్యాప్తంగా బంగారంపై ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోవడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారంను భౌతికంగానే కాకుండా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఆన్లైన్ ద్వారా బంగారం కొనుగోలు చేయడానికి ఈటీఎఫ్ అని అంటారు. ఈటీఎఫ్ ద్వారా బంగారం కొనుగోలు చేయాలంటే డీమార్ట్ అకౌంట్ వంటివి కచ్చితంగా ఉండాలి. జూలై నుంచి సెప్టెంబర్ వార్షిక కాలంలో గోల్డ్ ఈటీఎఫ్ లో దాదాపు 26 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. అంటే ఇండియన్స్ కరెన్సీ ప్రకారం రూ. 2,30,816 కోట్లు అని తెలుస్తోంది. ఇందులో భారతదేశానికి చెందినవారు 902 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. అంటే ఎనిమిది వేల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారని సమాచారం. అలాగే ఆగస్టు నెలలో అమెరికాలోని సెంట్రల్ బ్యాంకులు 15 టన్నుల బంగారంపై పెట్టుబడులు పెట్టారు. ఇలా అన్ని రకాలుగా బంగారంలకు డిమాండ్ పెరగడంతో వాటి ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే బంగారం తో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.2 లక్షల వరకు వెళ్ళింది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగారం పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే.. వెండి మాత్రం అవసరాలకు ఉపయోగించడం వల్ల దాని డిమాండ్ పెరుగుతుంది. వెండిని ఎక్కువగా సోలార్ ప్యానెల్, ఎలక్ట్రికల్ కార్లతోపాటు కొన్ని పరికరాల్లో ఉపయోగిస్తారు. సోలార్ ప్యానెల్ లో వెండి కండక్టర్ గా పనిచేస్తుంది. అందుకే వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అలాగే ఎలక్ట్రిక్ కార్లలో కూడా వెండిని 15 నుంచి 30 గ్రాముల వరకు ఉపయోగిస్తారు. మరోవైపు భారత దేశంలో వెండిని ఆభరణాల కోసం కొనుగోలు చేస్తున్నారు.
అయితే ఇనుము, కాపర్ వంటి లోహాల తయారీలో అదనంగా వెండి ఉత్పత్తి అవుతుంది. వెండి నేరుగా ఉత్పత్తి అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మార్కెట్లో ఇది తక్కువగా ఉండడంతో వెండి ధరలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో వెండి ధరలు 3 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. బంగారం సైతం 10 గ్రాముల కు 2 లక్షలకు మించవచ్చని చెబుతున్నారు.
అయితే బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులు మాత్రం అయోమయంలో పడిపోయారు.. ప్రస్తుత సమయంలో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. అయితే పూర్తిగా బంగారంపై పెట్టుబడులు పెట్టే బదులు.. అవసరం ఉన్నంతవరకు కొనుగోలు చేయడం మంచిది అని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.
[