మహబూబ్ నగర్: పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం నాల్గవ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ కు పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం పాలమూరు విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవం లో గవర్నర్ 12 మంది స్కాలర్స్ కు పి హెచ్ డి పట్టాలను, 83 మందికి బంగారు పతకాలను అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె సత్యనారాయణ రెడ్డి తొలి గౌరవ డాక్టరేట్ ను గవర్నర్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి హెచ్ డి స్కాలర్స్ లను బంగారు పతకాల గ్రహితలను, తొలి డాక్టరేట్ గ్రహీత మన్నె సత్యనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఎపి జితేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, పాలమూరు ఉపకులాపతి జి.ఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
