
దిశ, వెబ్ డెస్క్: బుధవారం రాత్రి మంత్రి కొండా సురేఖ ఇంటివద్ద హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా తాజాగా ఈ ఇష్యూపై కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ నాయకులు కొండా మురళి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో తమకు ఎలాంటి వైరుద్యాలు లేవని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి తరవాత తెలంగాణకు అంతటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనుకున్నామని ఆయన సీఎం కావాలని కోరుకున్నామని చెప్పారు. ఎవరైనా సృష్టిస్తే దానికి తాను బాధ్యుడిని కానని చెప్పారు.
ఈ రోజు వరంగల్ లో పార్టీ మీటింగ్ ఉందని దానికోసమే వచ్చానని చెప్పారు. ఇంటివద్ద ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. పార్టీ మీటింగ్ కు కొండా సురేఖ కూడా వస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. తను ఇప్పటివరకు ఒకసారి కూడా సెక్రటరేట్‌కు వెళ్లలేదని ఇకపై కూడా వెళ్లనని చెప్పారు. కొండా సురేఖ చాంబర్ వాస్తు చూడటానికి మాత్రమే ఒకసారి వెళ్లానని అన్నారు. తనకు ఏమైనా అవసరం ఉంటే ఉత్తమ్, రేవంత్ రెడ్డి ఇళ్లకు వెళతానని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం ఆయన వెంట వెళ్లానని అన్నారు. నా కూతురు లండన్లో పెరిగింది. నా బిడ్డకు ఏ పదవి లేదు. ఆమెకు స్వేచ్ఛ ఉంది. ఆమె మాట్లాడిందో తెలియదని అన్నారు. నాకు ఫోన్ కూడా చూడరాదని చెప్పారు.
Read More..
మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా.. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు
మంత్రుల పేషిపై నిఘా పెంచిన సర్కారు.. ఇంటెలిజెన్స్‌కు బాధ్యతలు