ఆన్ లైన్ లో సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? రూ.2 లక్షల మోసం గురించి మీకు తెలుసా? – Telugu News | Hyderabad Online Fraud: Rs 2 Lakh Lost to WhatsApp APK Scam, No OTP Required video TV9D

తక్కువ ధరకు వస్తున్నాయని గ్రోసరీ స్టోర్‌ లో సరుకులు ఆర్డర్ చేసిన వ్యక్తి మోసపోయాడు. సరుకులు ఆర్డర్ చేసిన రెండ్రోజుల తర్వాత ఓ వ్యక్తి ఇంటికి వచ్చి పేమెంట్‌ పెండింగ్‌లో పడిందని తెలిపాడు. వాట్సాప్‌ లింక్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని కోరడంతో కస్టమర్‌ ఆ లింక్‌ ద్వారా 360 రూపాయలు పేమెంట్‌ చేసాడు. అతని ప్రమేయం లేకుండానే లక్షా 97 వేల రూపాయలు మాయం అవ్వడంతో షాకయ్యాడు. ఓటీపీ కూడా చెప్పలేదు.. ఎలా క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయా అని పోలీసులను ఆశ్రయించాడు. WhatsApp ద్వారా పంపిన APK ఫైల్ ఇన్‌స్టాల్ చేయడంతో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. OTP ఇవ్వకపోయినా క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. ఫైల్ ఇన్ స్టాల్ చేయడంతో ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ అయినట్లు గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం చింతగట్టు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగింది. హైదరాబాదు నుండి వరంగల్ వైపు వెళ్తున్న TS 09FG 7495 నెంబర్ గల కారు చింతగట్టు సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. కారుకు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో అదుపుతప్పి బోల్తా పడింది.. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అయ్యాయి. వారంతా సురక్షితంగా బయట పడ్డారు. బోల్తాపడ్డ కారు పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం తప్పదని భావించారు. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు వెంటనే అక్కడికి చేరుకొని కారులో ఉన్నవారిని బయటకు తీశారు. కారు పక్కకు తొలగించి వారిని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేగంగా దూసుకెళ్తున్న కారు.. ఒక్కసారిగా

దీపావళికి ముందు ఇలా చేయండి..ఇంటికున్న దరిద్రం పారిపోతుంది

మ్యాన్‌ ఈటర్‌ మళ్లీ వచ్చింది.. రైతును ఈడ్చుకెళ్లి

టెక్కీలకు షాక్ H-1B హైరింగ్ ఆపేసిన TCS

వరుడి గొంతెమ్మ కోర్కెలు వివాహం రద్దు చేసుకున్న వధువు

Leave a Comment