
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ తొలిసారిగా అడ్వెంచర్ టూరర్ విభాగంలోకి అడుగుపెట్టింది. అపాచీ ఆర్‌టీఎక్స్300 బుధవారం విడుదల చేసిన కంపెనీ, ధరను రూ. 1.99 లక్షల(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ఇప్పటికే అడ్వెంచర్ విభాగంలో కేటీఎం 250 అడ్వెంచర్, యెజ్‌డీ అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ బైకులకు ఆర్‌టీఎక్స్300 పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. టీవీఎస్ కొత్తగా అభివృద్ధి చేసిన 299సీసీ, లిక్విడ్-ఆయిల్ కూల్డ్, సింగిల్-సిలిండర్ ఆర్‌టీ-ఎక్స్‌డీ4 ఇంజిన్‌తో వస్తుంది. ఇది 9,000 ఆర్‌పీఎంతో 35.5 హెచ్‌పీ, 7,000 ఆర్‌పీఎంతో 28.5 టార్క్ విడుదల చేస్తుంది. ఇది బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్‌తో 6-స్పీడ్ గేర్ కలిగి ఉంది. వైపర్ గ్రీన్, టార్న్ బ్రాంజ్, మెటాలిక్ బ్లూ, లైట్నింగ్ బ్లాక్, పెర్ల్ వైట్ రంగులలో ఈ బైక్ లభిస్తుంది. కొత్త అపాచీ ఆర్‌టీఎక్స్300 స్పీడ్, కాల్ అండ్ ఎస్సెమ్మెస్ అలర్ట్, సెగ్మెంట్-ఫస్ట్ మ్యాప్ మిర్రరింగ్, గోప్రో కంట్రోల్, ఇతర వివరాలు తెలియజేసేలా టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ బైక్ టూర్, ర్యాలీ, అర్బన్, రెయిన్ మోడ్‌లతో సహా నాలుగు వేర్వేరు రైడింగ్ మోడ్‌లతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.
BSNL: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా.. రూ. 1కే రోజుకు 2జీబీ డేటా