Site icon Desha Disha

Raj Bhavan in Amaravati: అమరావతిలో రాజ్ భవన్?

Raj Bhavan in Amaravati: అమరావతిలో రాజ్ భవన్?

Raj Bhavan in Amaravati: ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో గవర్నర్ నివాసానికి సంబంధించి రాజ్ భవన్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అమరావతి రాజధానిలో కీలక నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, ఆపై ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూముల్లో భవన నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. మరోవైపు ఏకకాలంలో 12 బ్యాంకు ప్రధాన కార్యాలయాల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సమక్షంలో వాటి నిర్మాణాన్ని మొదలుపెట్టనున్నారు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ అధికార నివాసం రాజ్ భవన్ ఏర్పాటుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమరావతిలో కీలకమైన సిఆర్డిఏ భవనాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ భవన నిర్మాణం ప్రారంభం అయింది. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పర్యవేక్షణతో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు ఈ కార్యాలయంలో జరగనున్నాయి.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత..
సాధారణంగా ఈ రాష్ట్రానికి పరిపాలించేది ప్రభుత్వం. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రధాన పరిపాలకుడు. కానీ గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ప్రథమ పౌరుడు. విధానపరమైన నిర్ణయాల్లో గవర్నర్ ది కీలక పాత్ర. రాజధాని లో రాజ్ భవన్ ఉంటుంది. కానీ రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతోంది. రాజ్ భవన్ అనేది తాత్కాలిక కార్యాలయంలో కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో.. రాజ్ భవన్ నిర్మాణం అనేది జరగాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం వీలైనంత త్వరగా రాజ్ భవన్ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంది. ఈరోజు కీలకమైన ఉత్తర్వులు జారీచేసింది.

శాశ్వత నిర్మాణం లేదు
రాజ్ భవన్ అనేది గవర్నర్ అధికారిక కార్యాలయం. అది రాజ్యాంగబద్ధ పదవి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ గవర్నర్ నియామకానికి సంబంధించి సిఫారసు చేస్తుంది. రాజ్ భవన్ అనేది చాలా రకాల విభాగాలతో ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతోంది. అయితే గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ శాశ్వత నిర్మాణం ఇంతవరకు కాలేదు. ఇప్పటివరకు తాత్కాలిక భవనంలోనే రాజ్ భవన్ కొనసాగుతూ వస్తోంది. అయితే తాజాగా 212 కోట్ల తో.. కొత్త రాజ్ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక వసతులతో.. అమరావతికి సరికొత్త గుర్తింపుగా ఈ రాజ్ భవన్ నిర్మాణం కానుంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ రాజ్ భవన్ నిర్మాణం పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంగా తెలుస్తోంది. ఈ భవనాన్ని పూర్తిచేసి గవర్నర్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. మరి అనుకున్న స్థాయిలో ఈ భవన నిర్మాణం పూర్తి చేస్తుందో? లేదో? చూడాలి.

Exit mobile version