Ponguleti vs Konda Surekha: పొంగులేటి, కొండా సురేఖకు మధ్య పంచాయితీ అతడి వల్లేనా?

Ponguleti vs Konda Surekha: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. నిన్న మేడారం అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్వహించిన సమీక్ష సమావేశానికి సురేఖ హాజరు కాలేదు. అంతకుముందు అభివృద్ధి పనులకు సంబంధించి తను చెప్పిన వారికి కేటాయింపు జరగడంలేదని సురేఖ అంతర్గతంగా వ్యాఖ్యానించినట్టు మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. దీనికి తోడు కొండా దంపతులు ఈ వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగ ప్రవేశం చేశారని.. కొండా దంపతులతో సీరియస్ గా మాట్లాడారని ప్రచారం కూడా జరిగింది. గులాబీ పార్టీకి చెందిన మీడియా ఈ వార్తలకు విరితమైన ప్రయారిటీ ఇచ్చింది. ఇవన్నీ నిజం కాదని.. ఊహాగానాలు మాత్రమేనని కొండా క్యాంప్ పేర్కొంది.

ఇదంతా జరుగుతుండగానే కొండా సురేఖకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సురేఖ ప్రైవేట్ ఓ ఎస్ డి సుమంత్ ను ఆ పదవి నుంచి తొలగించింది. సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ, అటవీ శాఖలో డిప్యూటేషన్లు, బదిలీలు మొత్తం సుమంత్ చెప్పినట్టే జరుగుతున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు వినిపించాయి. సుమంత్ ఏకంగా ఐఏఎస్ స్థాయి వ్యక్తులకు ఆర్డర్లు వేసేంతగా ఎదిగారని ఆరోపణలు వినిపించాయి. పాలనాపరమైన వ్యవహారాలలో సుమంత్ కలగచేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇంటలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకొని సుమంత్ ను పక్కన పెట్టారు.

సుమంత్ ను పీసీబీ టెర్మినేట్ చేసేది. దేవాదాయ, అటవీ శాఖలలో తన స్థానాన్ని ఆయన దుర్వినియోగం చేసినట్టు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మేడారం అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న పనుల విషయంలో సురేఖ, శ్రీనివాస రెడ్డికి మధ్య విభేదాలు ఏర్పడేందుకు కారణం అతడేనని తేలింది. సరిగ్గా 2023లో డిసెంబర్ నెలలో సుమంత్ ఓ ఎస్ డి గా నియమితులయ్యారు. ఆయన కాంట్రాక్ట్ ను 2025 వరకు పొడగించారు. తనకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు.. తెర వెనుక ఇతర వ్యవహారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అతనిపై వేటువేసింది.

సుమంత్ ను తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖలో సుమంత్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఆ శాఖలో పనిచేస్తున్న ఉన్నత సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. చివరికి ఆ శాఖలో పనిచేస్తున్న పెద్ద పెద్ద స్థాయి అధికారులకు కూడా సుమంత్ ఆదేశాలు ఇచ్చేంతగా ఎదిగిన నేపథ్యంలో.. వారంతా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అందువల్లే సుమంత్ మీద ప్రభుత్వం వేటు వేసినట్టు సమాచారం. అయితే సుమంత్ ను తొలగించిన నేపథ్యంలో కొండ సురేఖ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి దీనిపై ఆమె ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Leave a Comment