మేషం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో కుజ, రవులు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉన్నత కుటుంబంతో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపార భాగస్వాములతో విభేధాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వపరంగా లబ్ధి చేకూరుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విలాస జీవితం అలవాటవుతుంది.
కర్కాటకం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో ఈ రెండు గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. సామాజికంగానే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా హోదా పెరుగుతుంది. ఇంట్లో ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. రియల్టర్లకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం లేదా ఇల్లు మారడానికి, స్థాన చలనానికి అవకాశం ఉంది.
తుల: ఈ రాశిలో రవి, కుజుల యుతి వల్ల ఈ రాశివారికి రాజయోగాలు, ధనయోగాలు కలుగుతాయి. ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ప్రభుత్వం నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది.
ధనుస్సు: ఈ రాశివారికి లాభ స్థానంలో కుజ, రవుల కలయిక బాగా యోగిస్తుంది. ఈ రాశికి పంచమాధిపతి అయిన కుజుడు భాగ్యాధిపతి రవిని లాభ స్థానంలో కలవడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.
మకరం: ఈ రాశివారికి దశమ స్థానంలో కుజ, రవుల కలయిక వల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది.
కుంభం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో ఈ రెండు గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల తప్పకుండా విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగావకాశాలు, ఆదాయావకాశాలు బాగా పెరుగుతాయి. విదేశాల్లో విద్య, ఉద్యోగావకాశాలకు అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.