Site icon Desha Disha

Kiran Abbavaram Viral Video: ‘ఓజీ’ గురించి మాట్లాడేందుకు నిరాకరించిన హీరో కిరణ్ అబ్బవరం.. వీడియో వైరల్!

Kiran Abbavaram Viral Video: ‘ఓజీ’ గురించి మాట్లాడేందుకు నిరాకరించిన హీరో కిరణ్ అబ్బవరం.. వీడియో వైరల్!

Kiran Abbavaram Viral Video: యంగ్ హీరోలలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) వీరాభిమానులు అని చెప్పుకొని తిరిగేవారిలో ఒకరు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఒక పండగ లాంటి చిత్రం ‘ఓజీ'(They Call Him OG). మామూలు మూవీ లవర్స్ కి ఈ సినిమా యావరేజ్ అని అనిపించి ఉండొచ్చేమో కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఒక విజువల్ ఫీస్ట్. గత పదేళ్లలో ఏ స్టార్ డైరెక్టర్ కూడా ఆయన్ని ఈ రేంజ్ లో చూపించలేకపోయారు. కిరణ్ అబ్బవరం ఈరోజు ఒక ట్రెండింగ్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ ఆయన హీరో కంటే ముందు ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని నే. కాబట్టి ఆయనకు కూడా ఓజీ చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ లాంటిది. ఆయన హీరో గా నటించిన ‘k ర్యాంప్'(K Ramp Movie) మూవీ ప్రొమోషన్స్ లో విలేఖరుల నుండి తరచూ ఓజీ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురు అవుతూనే ఉన్నాయి.

ఒక విలేఖరి కిరణ్ అబ్బవరం ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు పవన్ కళ్యాణ్ వీరాభిమాని కదా, ఓజీ సినిమాని మొదటి రోజు చూసిన అనుభూతి మీకు ఎలా అనిపించింది?’ అని అడగ్గా, దానికి కిరణ్ అబ్బవరం సమాధానం చెప్తూ ‘ఇప్పుడు నా సినిమా ప్రొమోషన్స్ లో, ఓజీ గురించి మాట్లాడి, ప్రొమోషన్స్ కోసం ఓజీ పేరు ని వాడుకొని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ టికెట్స్ ని కొనుగోలు చేసే ప్లాన్ కిరణ్ అబ్బవరం వేసాడు అని సోషల్ మీడియా లో కొంతమంది ట్రోల్స్ చేస్తారు. అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నా నిజమైన అభిమానం నా మనసులో ఉంది. దానిని సినిమా కోసం వాడుకోను’ అంటూ చెప్పుకొచ్చారు. దీనిని బట్టీ చూస్తే కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా ని ఏ రేంజ్ లో అనుసరిస్తున్నాడో అర్థం అవుతుంది.

ఈమధ్య కాలం లో సెలబ్రిటీలు ఏది మాట్లాడిన ఒక సెక్షన్ నెటిజెన్స్ సోషల్ మీడియా లో పెద్ద రచ్చ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి వాటిల్లో నెగిటివిటీ పెద్దగా కనిపించదు కానీ, ట్విట్టర్ లో మాత్రం తీవ్రమైన నెగిటివిటీ కనిపిస్తుంది. కొద్దిరోజుల క్రితమే ‘k ర్యాంప్’ ప్రమోషనల్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం, తన డైరెక్టర్ తో ఫ్యాన్ వార్స్ చేస్తాడు. సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ఫ్యాన్ వార్స్ జరుగుతాయో, అదే స్టేజి మీద రిపీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కొంతమంది క్యూట్ గా ఫీల్ అయితే, మరికొంత మంది మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్స్ చేశారు. అందుకే కిరణ్ అబ్బవరం ఓజీ గురించి మాట్లాడడం తగ్గించాడు.

Exit mobile version