Horoscope Today: ఆ రాశికి ఆకస్మిక ధనలాభ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు – Telugu News | Horoscope Today October 15, 2025: Astrological prediction for all zodiac signs in Telugu

దిన ఫలాలు (అక్టోబర్ 15, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్త అందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి ఆదాయ ప్రయత్నాలు లాభసాటిగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆస్తి క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన యోగానికి అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధికి అనుకూల వాతావరణం ఉంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు శుభవార్తవింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. అధికారుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్య మైన పనులు, వ్యవహారాలను పూర్తి చేయగలుగుతారు. వ్యక్తిగత సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. ఆదాయ ప్రయత్నాలు లాభసాటిగా సాగిపోతాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మీ వల్ల బంధుమిత్రులు కొందరు ప్రయోజనం పొందు తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మీద బాగా ఎక్కువగా ఖర్చు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు ఎక్కువవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. పిల్లలకు విషయంలో శుభ వార్తలు వింటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగం విషయంలో శుభవార్త అందుతుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కొత్త ప్రయత్నాలకు, కార్యక్రమాలకు ఇది అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికార వర్గాల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు బంధువులు, సన్నిహితులతో ఏర్పడ్డ వివాదాలు తగ్గే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే, దానితో పోటీగా ఖర్చులు కూడా పెరుగుతాయి. మిత్రుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొద్దిగా చికాకులు తప్పక పోవచ్చు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితిలో బాగా మెరుగు దల కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధు వులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తల పెట్టిన పనులలో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, నిదానంగా వాటిని పూర్తి చేయడం జరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా శ్రమాధిక్యత, పని ఒత్తిడి ఉండవచ్చు. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషా లతో సాగిపోతుంది. అనుకున్న పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొద్దిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

Leave a Comment