వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఏదో ఒక లోహానికి సంబంధించింది. శనిశ్వరుడికి ఇనుము, సూర్యుడికి రాగి, చంద్రుడికి వెండి, గురుడికి బంగారం సంబంధం కలిగి ఉంది. అయితే భారతీయులు ఈ లోహల్లో అత్యధిక ప్రాముఖ్యత బంగారానికి ఇస్తారు. వాస్తవంగా అన్ని రత్నాలు, అన్ని లోహాలు అందరికీ సరిపోవు..
బంగారం విషయానికి వస్తే.. బంగారు ఆభరణాలు ఆర్ధిక భరోసాకు, పెట్టుబడికి, ఆడంబరానికి సంబంధించిన లోహంలా భావిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది అందరికీ సరిపోదు. కొన్ని రాశుల వారు బంగారం ధరించడం వలన ఆర్ధిక ఇబ్బందులను, కష్టాలు, నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దురదృష్టాన్ని నివారించడానికి బంగారానికి దూరంగా ఉండాల్సిన రాశులు ఏమిటో తెలుసుకుందాం..
వృషభ రాశి: ఈ రాశిలో జన్మించిన వారు బంగారు ఆభరణాలు ధరించడం మంచిది కాదు. ఈ రాశిని పాలించే గ్రహం శుక్రుడు. ఈ రాశిలో జన్మించిన వారు బంగారంపై మక్కువతోనో.. స్టేటస్ సింబల్ అనుకుని బంగార ఆభరణాలు ధరించాలని భావిస్తే.. వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాదు విస్తృతమైన ఉద్యోగ , వ్యాపారం, వృత్తి ఇలా ఏ రంగంలో ఉన్నా నష్టాలను అనుభవిస్తారు. ప్రియమైనవారితో సంబంధాలు దూరం అవుతాయి. సంబంధాలు దెబ్బతింటాయి.
మిథున రాశి: ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు బంగారు ఆభరణాలకు దూరంగా ఉండాలి. మిథున రాశి వారు బంగారం ధరిస్తే, గణనీయమైన ఆర్థిక నష్టాలు సంభవించే ప్రమాదం ఉందని భావిస్తారు.
వృశ్చిక రాశి : ఈ వృశ్చిక రాశిని పాలించే గ్రహం కుజుడు. ఈ రాశికి చెందిన వారు కూడా బంగారు ఆభరణాలకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారికి బంగారాన్ని ప్రత్యర్థిగా పరిగణిస్తారు. ఈ పరిస్థితిలో వృశ్చిక రాశి వారు బంగారం ధరించాలని ఎంచుకుంటే అది వారికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.
కుంభ రాశి: కుంభ రాశికి శనీశ్వరుడు అధిపతి. వీరు కూడా బంగారు ఆభరణాలు ధరించవద్దని జ్యోతిష్యులు సలహా ఇస్తున్నారు. బంగారం గురుఉ, సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశిని శనీశ్వరుడు పాలిస్తాడు. కనుక వీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ బంగారు వస్తువులను ధరించడం మంచిది కాదు. వీరు బంగారం ధరిస్తే వారి జీవితాలు సమస్యాత్మకంగా మారవచ్చు. నిత్యం సంఘర్షణను ఎదుర్కొంటు ఉంటారు.