తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి లాభాలు, రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. మదుపులు, పెట్టుబడులు వంద శాతం లాభాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరగడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా అత్యధికంగా లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.
