మీరు రాత్రి సరిగా నిద్ర రావటం లేదని బాధపడుతున్నారా? ఈ చిన్న చిట్కతో హాయిగా నిద్రపోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగితే హాయిగా ప్రశాంతంగా నిద్రపడుతుంది..అంతేకాదు.. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే మరెన్నో లాభాలు ఉన్నాయి. పాలలో పుష్కలమైన పోషకాలు నిండివున్నాయి. కాల్షియం, విటమిన్ D ఉంటాయి. ఇవి విటమిన్లు ,ఖనిజాలతో ఉంటాయి. పాలు తాగడం వలన బలమైన ఎముకలు ,కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి, మంచి నిద్రను పొందేల చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పాలు,పాల పదార్దాల్లో ట్రిప్టోఫాన్ అనే సహజమైన అమినో ఆమ్లం ఉంటుంది. సెరోటోనిన్ , మెలటోనిన్ లాంటి మెదడు రసాయనాల నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన మూలకంగా పనిచేస్తుంది. ఇది మన మనస్సు ను విశ్రాంతి చెందేలా చేసి హాయిగా నిద్ర పోయేలా సహాయపడతాయి. పలు పరిశోధనల ప్రకారం పాలు, ఇతర పాల ఆహారాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు , యాంటి ఇన్ఫలమేటరీ సమ్మేళనాలు శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. దీని వలన మంచి నిద్రను పొందవచ్చు.
పాలలో అధిక నాణ్యత గల ప్రోటీన్లు కండరాల పునరుద్ధరణకు సహాయ పడతాయి. దీనిలోని ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోకండరాలు బలంగా తయారు అవుతాయి. పాల పదర్దాలలో మెగ్నీషియం,జింక్ ఉంటుంది.ఇవి మెదడు రసాయనాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి.ఇవి సరైన మోతాదులో అందితే శరీరం ఆరోగ్యమైన నిద్రను పొందుతుంది.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
[