Vijayendra Prasad And Rajamouli: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కీలకపాత్ర వహిస్తోంది. హీరో అయిన, దర్శకులకైన సక్సెస్ ఉంటేనే ఇక్కడ అవకాశాలు వస్తాయి… ఒక సక్సెస్ తో పది అవకాశాలు వస్తే, ఒక ఫ్లాప్ తో చాలా సంవత్సరాల పాటు ఖాళీగా ఉండాల్సిన సమయం రావచ్చు. అందుకే సక్సెస్ ని సాధించడానికి ఇండస్ట్రీలో తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటితో సూపర్ సక్సెస్ లను సాధించిన ఏకైక దర్శకుడు రాజమౌళి… చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెస్ గా నిలవడంతో ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా మారాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాతో ఫ్యాన్ వరల్డ్ లో తన సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక రాజమౌళి చేసే ప్రతి సినిమాకి కథని వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ అందిస్తాడనే విషయం మనకు తెలిసిందే. అయితే కథ విషయంలో కెరియర్ మొదట్లో రాజమౌళికి విజయేంద్రప్రసాద్ కొన్ని సలహాలైతే ఇచ్చాడట.
ఎక్కడైతే ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుందో, దానిని ప్రేక్షకుడికి స్లో గా ఎక్కించాలని, ఆ తర్వాత ఎలివేషన్స్ తో కూడిన కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులకు అందించినప్పుడే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పాడట. అలాగే కథ ప్రకారం రైటర్ కూడా ఆ సినిమాకి న్యాయం చేయగలుగుతాడు అంటూ ఆయన చెప్పిన మాటలను రాజమౌళి ఫాలో అవుతున్నాడు.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన వరుస సక్సెస్ లను సాధించడానికి ఇదే ఫార్ములాను వాడుతూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… రాజమౌళి తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ మాస్ సినిమాలే కావడం విశేషం…ఈ మధ్యకాలంలో ఆయన గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ మాస్ ప్రేక్షకులను అలరిస్తూనే అందులో ఎలివేషన్స్ ను సైతం రంగరించి విజువల్ వండర్లను క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతన్ని ఢీకొట్టే దర్శకుడు మరొకరు లేరు అనేది వాస్తవం… ఇక ముందు కూడా ఆయన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపైతే వస్తోంది…