
దిశ, వెబ్‌డెస్క్: ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu)కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే AusBiotech అంతర్జాతీయ సమావేశం-2025కు హాజరు కావాలని, అదేవిధంగా అమూల్యమైన ఉపన్యాసం ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌బాబుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ ఆయనకు ఇన్విటేషన్ అందజేశారు. కాగా, AusBiotech అంతర్జాతీయ సమావేశం ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ మెల్‌బోర్న్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో అక్టోబర్ 21 నుంచి 24 వరకు జరగనుంది. ఈ సదస్సు బయోటెక్, మెడ్‌టెక్, డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్స్ థీమ్‌తో జగనుంది. ఇందులో ప్రధానంగా కీనోట్ స్పీచ్‌లు, ప్యానెల్ డిస్కషన్స్, వర్క్‌షాప్‌లు, సైట్ టూర్స్, ఎగ్జిబిషన్లు ఉంటాయి.