Bigg Boss 9 Telugu: టెలివిజన్ రంగంలో భారీ పాపులారిటిని సంపాదించుకున్న షో లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. అందులో బిగ్ బాస్ ఒకటి…ఇక ఇప్పటివరకు బిగ బాస్ 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు తొమ్మిదోవ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నప్పటికి కొన్ని విషయాల్లో మాత్రం బిగ్ బాస్ షో మీద చాలా మంది విమర్శలు చేస్తున్నారు… ఎందుకంటే టాలెంట్ ని కలిగి ఉన్న కొంతమంది వ్యక్తులను బిగ్ బాస్ హౌస్ లో భాగం చేసి వాళ్ళ చేత కొన్ని టాస్క్ లను పెట్టించి మొత్తానికైతే అందులో ఎవరో ఒకరిని ఫైనల్లో విజేతగా నిలపాలనే పాయింట్ తో వచ్చిందే బిగ్ బాస్ షో…
కానీ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి అలాగే షో పాపులారిటి పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో తప్పు పనులు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ అయిన వాళ్ళని సైతం బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అంటూ మరి కొంతమంది విమర్శకులు బిగ్ బాస్ షో యాజమాన్యాన్ని తప్పుపడుతున్నారు. ఇక రీసెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, దివ్వెల మాధురి రావడం ఈ షో కి చాలా వరకు మైనస్ గా మారింది.
ఎందుకంటే అప్పటిదాకా సీరియల్స్ లో నటించిన వాళ్లు, యూట్యూబ్ సెలబ్రిటీలు, సినిమా యాక్టర్స్, షోలలో కామెడీ చేసేవాళ్లను మాత్రమే ఇందులో భాగం చేశారు… కానీ రమ్య, మాధురీలు రావడంతో వీళ్ళకి ఏ టాలెంట్ ఉందని బిగ్ బాస్ లో భాగం చేశారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. బహుశా బూతులు బాగా తిడుతారని వాళ్ళను షో లో భాగం చేశారేమో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
షో కి పాపులారిటీ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఏవేవో తప్పులు చేసి ట్రోలింగ్ కి గురైన వాళ్లను తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో వేస్తే ప్రేక్షకులు పిచ్చోళ్ళ మాదిరిగా చూస్తారు అనుకుంటున్నారు. నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి రావాలి అంటే ఒక అర్హత ఉండాలి. అంతే తప్ప ఎవర్ని పడితే వారిని ఎందుకు తీసుకొస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ల ద్వారానే ఈ షో మీద భారీ వ్యతిరేకత వస్తోందనేది వాస్తవం…