పూటకు ఒక గొడవ..ప్రతీ దానికి రాద్ధాంతం..హౌస్ మేట్స్

Bigg Boss 9 Telugu Divvala Madhuri: రాజకీయ నేపథ్యం ఉన్న దివ్వెల మాధురి బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ఈ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా రాబోతుందని, షో ప్రారంభం కాకముందే ఒక లీక్ వచ్చింది. ఈ లీక్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి షాకింగ్ రియాక్షన్స్ వచ్చాయి. ఆమెని బయట ఇంటర్వ్యూస్ లోనే చూడలేకపోతున్నాం, అలాంటి ఆమెని బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం ఎందుకు అంటూ సోషల్ మీడియా లో నెగిటివ్ కామెంట్స్ చాలానే వినిపించాయి. అందరూ ఊహించినట్టు గానే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డుగా అడుగుపెట్టడం జరిగింది. వచ్చిన రోజే తన బలుపు ని చూపిస్తూ శ్రీజ తో గొడవలు పెట్టుకుంది. వామ్మో, ఈమె ఇలా ఉందేంటి అని హౌస్ మేట్స్ అందరూ భయపడ్డారు. తనూజ అయితే ఈమెను చూసి వణికిపోయి, ఆమెతో స్నేహం చేసుకోవడం మంచిది అనుకొని, ఆమె చుట్టూ తిరగడం మొదలు పెట్టింది.

కుకింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్న ఈమె, తనకు అసిస్టెంట్స్ గా తనూజ, డిమోన్ పవన్ లను పెట్టుకుంది. వీళ్ళ పై ఈమె వంట చేస్తున్న సమయం లో ఎన్నో సందర్భాల్లో గొంతు పైకి లేపి మాట్లాడడం, అధికారం చలాయించడం వంటివి చేసింది. తనూజ సాధారణంగా తనపై ఎవరైనా గొంతు లేపి మాట్లాడినా, తన మీద అధికారం చలాయించే ప్రయత్నం చేసినా, భరించే అమ్మాయి కాదు. కానీ మాధురి విషయం లో మాత్రం భయపడి సైలెంట్ గా ఉంటుంది. ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన రెండవ రోజు, ఈమె దివ్య మరియు పవన్ కళ్యాణ్ లతో అనవసరమైన గొడవ పెట్టుకోవడం మనమంతా చూసాము. నిన్న కూడా దివ్య తో గొడవ పెట్టుకుంది. దివ్య ప్రస్తుతం ఫుడ్ మానిటర్ గా వ్యవహరిస్తోంది. ఈమె అనుమతి లేకుండా ఎవరు ఏది తీసుకోరు.

కానీ నిన్న మాధురి ఆమె అనుమతి తీసుకోకుండా, కర్రీ తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య, మాధురి ని ప్రశ్నించడం మొదలు పెట్టింది. ఇక్కడ వీళ్లిద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. దివ్య మామూలుగానే మాట్లాడే ప్రయత్నం చేసింది, కానీ మాధురి మాత్రం బలుపు మాటలు మాట్లాడుతూ, దివ్య ని రెచ్చగొట్టింది. హౌస్ లో ఉన్నవాళ్ళంతా రోజు ఏంటి ఈ నాన్ సెన్స్ అనే ఎక్స్ ప్రెషన్స్ పెట్టారు. ఈ గొడవ పూర్తి అయిన కాసేపటికి సంజన తో గొడవ పెట్టుకుంది. వాష్ రూమ్ క్లీనింగ్ మానిటర్ గా వ్యవహరిస్తున్న సంజన, అక్కడ అద్దం వద్ద ఉన్న మాధురి బొట్టులను తీసి చెత్తలో పడేసింది అట. ఈ విషయం తెలుసుకున్న మాధురి ఫుల్ ఫైర్ అయిపోయి, సంజన ని అనరాని మాటలు అనేసింది. తీరా చూస్తే అదంతా ప్రాంక్ అట. ఇలా పూటకు ఒక ట్విస్ట్ ఇస్తూ హౌస్ మేట్స్ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంది దివ్వెల మాధురి.

Leave a Comment