పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే ఎలా ఉండాలంటే..?

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి పేరును సంపాదించి పెట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గౌరవాన్ని కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక రీసెంట్ గా ఆయన చేసిన ఓజీ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో పాన్ ఇండియాలో మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక ఆయనకు పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపు వచ్చింది. కాబట్టి ఆయన చేసే సినిమాలా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు… ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే చాలా వైవిధ్య భరితమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలను చేయాలి.

ఏమాత్రం తేడా కొట్టిన కూడా సినిమా చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈయనతో చేసే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే సినిమా సక్సెస్ ఫుల్ గా నిలుస్తోందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి గన్స్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. కాబట్టి అతనితో గన్ను పట్టించే సినిమా కథలను రాసుకుంటే బాగుంటుంది. దానివల్ల పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కంఫర్ట్ గా చేస్తాడు. అలాగే సినిమా చూడడానికి ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకొని కనిపించారు.

కాబట్టి ఆ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను సంపాదించుకుంది. అలాగే సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది. చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాల్లో కూడా ఆయనకి గన్ పట్టుకునే క్యారెక్టర్ దొరుకుతుందా లేదా అనేది…మొత్తానికైతే పవన్ కళ్యాణ్ క్రేజ్ టాప్ లెవల్ కి వెళ్ళిపోయింది…ఇక రాబోయే సినిమాలతో ఆయన సక్సెస్ లను సాధిస్తే ఆయనను టచ్ చేసేవాళ్ళు ఉండరనే చెప్పాలి…

Leave a Comment