దీపావళి అంటేనే తీయ్యటి వేడుక.. దీపాల అలంకరణతో పాటు ఇంట్లో ఎక్కువగా స్వీట్స్ ఉంటాయి. అయితే, మీరు స్వీట్స్‌తో పాటు డార్క్ చాక్లెట్స్ కూడా తెచ్చుకోండి.. లేదంటే మీ ప్రియమైన వారికి గిఫ్ట్‌గా కూడా ఇవ్వొచ్చు.. ఈ డార్క్ చాక్లెట్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. పలు విటమిన్లు, మినరల్స్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక డార్క్ చాక్లెట్లను తరచూ తింటే ఆరోగ్య పరమైన లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు.
డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాల్స్ అనబడే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. రక్తనాళాలను ప్రశాంత పరుస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఫలితంగా బీపీ తగ్గుతుంది. దీంతో గుండె పోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. డార్క్ చాక్లెట్లను తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
డార్క్ చాక్లెట్లలో ఉండే కొకొవా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు తేల్చారు. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయని వారు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి డార్క్ చాక్లెట్లు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్లు ప్రీ బయోటిక్ ఆహారం. అందువల్ల జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
ఇవి కూడా చదవండి
డార్క్ చాక్లెట్లను తింటే మూడ్ మారుతుంది. ఒంటరితనం ఫీల్ అయ్యే వారు డార్క్ చాక్లెట్లను తింటే డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి నుంచి బయట పడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. మూడ్ బాగా లేనివారు, ఒత్తిడి, ఆందోళన ఉన్నవారు డార్క్ చాక్లెట్లను తింటుండాలి. ఇక వీటిని తింటే శరరీంలో న్యూరాన్లు సైతం యాక్టివ్ అవుతాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. బద్దకం పోతుంది. ఇలా డార్క్ చాక్లెట్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
[