హైదరాబాద్‌లోని కజకిస్తాన్ రిపబ్లిక్ గౌరవ కాన్సుల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ దుబాయ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కజకిస్తాన్ రిపబ్లిక్, ఇండియా రిపబ్లిక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి, పెంపొందించడానికి ఆయన దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. ఆర్థిక వృద్ధి, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పరస్పర పెట్టుబడులపై దృష్టి సారించి కీలక రంగాలలో త్రైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. మౌలిక సదుపాయాలు, ఫార్మాస్క్యూటికల్స్, ఎనర్జీ, సాంస్కృతిక మార్పిడి.. ప్రాధాన్యతా రంగాలలో ఇవి ఉన్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు కజకిస్తాన్ రిపబ్లిక్ గౌరవ రాయబారి రౌన్ జుమాబెక్ గౌరవార్థం ప్రతిష్టాత్మక క్యాపిటల్ క్లబ్ దుబాయ్, గేట్ విలేజ్‌లో డాక్టర్ ఖాన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి యుఏఈ, భారత్ నుంచి దౌత్యవేత్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రముఖ బిజినెస్ లీడర్లు హాజరయ్యారు. ఈ ప్రాగ్రామ్ మూడు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా భవిష్యత్తు-ఆధారిత చర్చలకు వేదికగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త అవకాశాలను శోధించడంలో ఈ సమావేశంలో పాల్గొన్న దేశాలు తమ ఉమ్మడి నిబద్ధతను వ్యక్తం చేశాయి.
కజకిస్తాన్, భారత్, యూఏఈ మధ్య బలమైన, దీర్ఘకాలిక సంబంధాలను నిర్మించడంలో అనితర ప్రయత్నాలకు అద్దం పడుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం, కీలక పారిశ్రామిక వ్యక్తులతో మరిన్ని సమావేశాలు జరిపే అవకాశం కూడా ఉన్నట్లు హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ గౌరవ కాన్సుల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.