Site icon Desha Disha

డ్యూడ్ vs కే ర్యాంప్ పోటీలో విజయం ఎవరికి దక్కబోతోంది..?

డ్యూడ్ vs కే ర్యాంప్ పోటీలో విజయం ఎవరికి దక్కబోతోంది..?

డ్యూడ్ vs కే ర్యాంప్ పోటీలో విజయం ఎవరికి దక్కబోతోంది..?

Dude Vs K Ramp: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిస్తే మరికొన్ని మాత్రం డిజాస్టర్లుగా మారుతున్నాయి. కారణం ఏదైనా కూడా సినిమా సక్సెస్ అయితేనే హీరోలకు మంచి క్రేజ్ దక్కుతోంది. లేకపోతే వాళ్ళ మార్కెట్ ను పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇక గత సంవత్సరం క సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కిరణ్ అబ్బవరం… క సినిమాతో ఆయన 50 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాడు. ప్రస్తుతం ఆయన కే ర్యాంప్ అనే సినిమాని చేశాడు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18 వ తేదన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్లు సైతం ప్రేక్షకులను అలరించాయి… ఇక తనకు పోటీగా తమిళ్ హీరో అయిన ప్రదీప్ రంగనాథన్ చేస్తున్న ‘డ్యూడ్’ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాతో ప్రదీప్ కూడా మంచి విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు. 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం…

ఇక రెండు సినిమాల్లో ఏ సినిమా విజయాన్ని సాధిస్తోంది. ఏ సినిమా ఢీలా పడుతోంది అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా కిరణ్ అబ్బవరం ప్రదీప్ రంగనాథన్ ను ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి సందర్భంలోనే వీళ్ళ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడంతో సక్సెస్ ను ఎవరు సాధిస్తారు.

తద్వారా ఎవరి మీద ఎవరు పై చేయి సాధించబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… ఇక వీళ్లిద్దరి కి మంచి మార్కెట్ ఉన్నప్పటికి వాళ్ల సినిమాలను ఏ రేంజ్కి తీసుకెళ్తారు. ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక డ్యూడ్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండడం విశేషం…

దానివల్ల ఈ సినిమాకి కొన్ని ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి డ్యూడ్ సినిమాకి ఓపెనింగ్స్ ఎక్కువగా వస్తాయి. ఇక ‘కే ర్యాప్’ సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో వస్తోంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంటేనే కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. మరి వీటిలో ఏ సినిమా పై చేయి సాధించి దీపావళి హిట్ గా నిలుస్తోంది అనేది తెలియాలంటే మరొక రెండు రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…

Exit mobile version