Site icon Desha Disha

గూస్ బంప్స్ రప్పిస్తున్న 'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్..సాయి ధరమ్ తేజ్ మాస్ కం బ్యాక్!

గూస్ బంప్స్ రప్పిస్తున్న 'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్..సాయి ధరమ్ తేజ్ మాస్ కం బ్యాక్!

గూస్ బంప్స్ రప్పిస్తున్న 'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్..సాయి ధరమ్ తేజ్ మాస్ కం బ్యాక్!

Sambarala Yeti Gattu Glimpse: ‘విరూపాక్ష’,’బ్రో ది అవతార్’ వంటి చిత్రాల తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) చేసిన చిత్రం ‘సంబరాల ఏటి గట్టు'(Sambarala Yeti Gattu). తన కెరీర్ లో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా, సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం గా గ్రాండ్ రిలీజ్ కానుంది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ నుండి ఈ రేంజ్ క్వాలిటీ సినిమా వస్తుందని అసలు ఊహించలేదని, కచ్చితంగా ఈ చిత్రం తో పెద్ద హిట్ కొట్టేలాగానే అనిపిస్తున్నదంటూ చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ గ్లింప్స్ వీడియో ని చూస్తుంటే మనకు KGF చిత్రం గుర్తు రాక తప్పదు. ఒక సూపర్ హిట్ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ ని అనుసరించడం మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు. సినిమా ని డైరెక్టర్ ఎలాంటి టేకింగ్ తో నడిపించాడు అనే దానిపైనే ఒక సినిమా బాక్స్ ఆఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రం ద్వారా రోహిత్ అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ లోనే విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఓజీ చిత్రం విడుదల అవుతుండడం తో ఆ ఆలోచన ని పక్కన పెట్టారు మేకర్స్. ఇప్పుడు డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈరోజు విడుదలైన గ్లింప్స్ వీడియో తోనే విడుదల తేదీ ని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు కానీ, అది జరగలేదు.

ఈ చిత్రం లో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది. తమిళం లో మంచి క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ మన టాలీవుడ్ కి ఈ చిత్రం ద్వారానే పరిచయం కాబోతుంది. గ్లింప్స్ చూసిన తర్వాత అర్థం అవుతుంది ఏమిటంటే, కొంతమంది ఆయుధాలను తయారు చేసే మనుషులను తీసుకొచ్చి, ఒక ప్రాంతం లో వాళ్ళ చేత రకరకాల ఆయుధాలు చేయిస్తూ, వాళ్ళను హింసకి గురి చేస్తూ ఉంటారు. అప్పుడు హీరో తన సమూహం తో కలిసి ఎలా పోరాడాడు అనేది స్టోరీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అర్థం అవుతుంది . సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా తో వేరే లెవెల్ కి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఆ ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయి అనేది చూడాలి.

Exit mobile version