Site icon Desha Disha

గురువారం రాశి ఫలాలు (16-10-2025)

గురువారం రాశి ఫలాలు (16-10-2025)

మేషం – ఆత్మీయుల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటారు. సాంస్కృతి కార్యక్రమాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ విషయాలలోనూ గృహది విషయాలలోనూ ఆసక్తి చూపుతారు.

వృషభం – చేస్తున్న వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

మిథునం – గృహ విషయాలకు అతిధి మర్యాదలకు ధనవ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. మానసిక ఉద్వేగాన్ని సాధ్యమైనంతగా అదుపు చేసుకోవడం మంచిది.

కర్కాటకం – ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.ఉద్యోగాలలో ఏర్పడిన అవంతరాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగినది.

సింహం – సుదీర్ఘమైన ఫోన్ సంభాషణలు సాగిస్తారు. వివాదాస్పద అంశాల విషయంలో చేసేది లేక కలిసొచ్చే కాలం వస్తే అన్ని సద్దుమడుగుతాయని భారం భగవంతుడి మీద వేసి మిన్నకుంటారు.

కన్య – పెట్టుబడులకు తగిన సహాయ సహకారాలు అందుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో అవి ఉపకరిస్తాయి. మానసిక ఆనందం కలుగుతుంది.

తుల – ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. కొంత మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది.

వృశ్చికం – వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతనమైన ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలు ముఖ్యం. మీ ప్రమయం వల్ల ఒక శుభకార్యం సానుకూలపడే సూచనలు ఉన్నాయి.

ధనుస్సు – అనుభవాలు నేర్పిన పాఠాలు దృష్టిలో ఉంచుకొని అడుగులు జాగ్రత్తగా వేస్తారు. ఎదుటివారి మనసును నొప్పించకుండా పనులను చక్కబెట్టుకోవడం ఎలా అన్నది మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపచేస్తుంది.

మకరం – చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించి తమ అనుకున్న లబ్ధిని పొందగలుగుతారు.

కుంభం – సమస్యల నుండి ఎప్పటికప్పుడు బయటపడే విషయం మీదనే దృష్టిని కేంద్రీకరిస్తారు. గాని శాశ్వతమైన పరిష్కారాలను అన్వేషించరు. శుభకార్యాలు ముడి పడతాయి.

మీనం – దూర ప్రాంతంలో ఉన్న మీవారికి ఇక్కడి స్థితిగతులను వివరించి వారిని ఆర్థిక సహాయం అర్థిస్తారు. సాంకేతిక విద్యా సంబంధమైన విషయాలలో పురోగతి బాగుంటుంది.

 

Exit mobile version