Site icon Desha Disha

హిమాలయాల్లో దొరికే ఈ పువ్వు.. ఆరోగ్యానికి దేవుడిచ్చిన అద్భుత వరం..! – Telugu News | Himalayan red Buransh flower juice turns weak to steel know benefits

హిమాలయాల్లో దొరికే ఈ పువ్వు.. ఆరోగ్యానికి దేవుడిచ్చిన అద్భుత వరం..! – Telugu News | Himalayan red Buransh flower juice turns weak to steel know benefits

హిమాలయాల్లో దొరికే ఈ పువ్వులు ఆరోగ్యానికి దేవుడిచ్చిన వరం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. ఈ బురాన్ష్ పువ్వు, రోడోడెండ్రాన్ అర్బోరియం అని కూడా పిలుస్తారు. భారతదేశం, నేపాల్, భూటాన్‌లో కనిపిస్తుంది. మన దేశంలో ఈ పూలు ఎక్కువగా ఎక్కువగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కొండ ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇవి ఔషధ గుణాలతో పాటు పోషకాలతో కూడి ఉన్నాయి. ఇదో అందమైన చెట్టు. ఇది మార్చి, ఏప్రిల్ నెలల్లో వికసిస్తుంది.

ఈ పర్వత పుష్పం జ్యూస్‌ బలహీనులను ఉక్కు మనుషులగా మారుస్తుంది. మీరు దీన్ని ఒకసారి రుచి చూశారంటే..మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది. బురాన్ష్ పువ్వులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది.
రోడోడెండ్రాన్ పూల రసం అనేక రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పూలతో చేసిన జ్యూస్‌ తీసుకోవడం వల్ల శరీర బలహీనత తొలగిపోయి, చాలా బలంగా మారతారు.

బురాన్ష్ పువ్వుల జ్యూస్‌ తాగడం వల్ల ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. బురాన్ష్లో క్వినిక్ యాసిడ్ ఉంటుంది, దీని రుచి అమోఘంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బురాన్ష్ లోని కాల్షియం కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చర్మం, గొంతు, పొట్టపై మంటగా ఉంటే ఈ పూల జూస్ తాగడంతో ఇరిటేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

బురాన్ష్ యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలను కలిగి ఉంది, అందుకే డయాబెటిక్ పేషెంట్లు బురాన్ష్ పువ్వుల రసాన్ని తాగవచ్చు. బురాన్ష్ పువ్వులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. బురాన్ష్ రెగ్యులర్ వినియోగం వలన జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాలను నివారిస్తుంది.

బురాన్ష్ పువ్వును రసం, వైన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, గుండె, కాలేయాన్ని రక్షించే గుణాలున్నాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

[

Exit mobile version