Site icon Desha Disha

Kolkata’s Underwater Metro: దేశంలోని తొలి అండర్‌ వాటర్ మెట్రోను చూశారా – Telugu News | Kolkata’s Underwater Metro: India’s First River Tunnel for Fast Travel video TV9D – Viral Videos in Telugu

Kolkata’s Underwater Metro: దేశంలోని తొలి అండర్‌ వాటర్ మెట్రోను చూశారా – Telugu News | Kolkata’s Underwater Metro: India’s First River Tunnel for Fast Travel video TV9D – Viral Videos in Telugu

కోల్‌కతా ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు. ఇందులో 10.8 కిలోమీటర్ల పొడవున మెట్రో మార్గం.. భూమి కింది భాగంలో ఉంటుంది. ఆ తరువాత నదిలోపలికి ప్రవేశిస్తుంది. ఈ మార్గంలో హావ్‌డా మైదాన్‌ నుంచి ఎస్‌ప్లనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర.. అంటే 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ ను నిర్మించారు. ఇది హుగ్లీ నదిని 45 సెకన్లలో దాటేస్తుంది. ఈ అండర్ వాటర్ టన్నెల్‌ను అత్యాధునిక టెక్నాలజీతో ప్రకృతి విపత్తులను కూడా తట్టుకునేలా రూపొందించారు. బ్రిటన్‌కు చెందిన సంస్థల సహకారంతో ఈ టన్నెల్ నిర్మించారు. ప్రస్తుతం హౌరా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటన్నర సమయం పడుతుండగా.. ఈ అండర్‌వాటర్‌ మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో కేవలం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ అండర్‌వాటర్ టన్నెల్ నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పై నుంచి వచ్చే నీటి ఒత్తిడిని తట్టుకుని, టన్నెల్ లోపలికి నీరు రాకుండా అడ్డుకునే యంత్రాన్ని రూపొందించాల్సి వచ్చింది. అయితే ఇలాంటి టన్నెల్ ను దేశంలో ఇప్పటికే నిర్మించినా.. ఈ టన్నెల్ మాత్రం నది లోపల ఉంది. సాధారణ టన్నెల్ బోరింగ్ మెషిన్‌తో… దీనిని ఆపరేట్ చేయడం వీలు కాలేదు. దీంతో ఈ టన్నెల్‌ను తవ్వడానికి అవసరమైన టన్నెల్ బోరింగ్ మెషిన్ ను ప్రత్యేకంగా జర్మనీలో తయారు చేశారు. ఇది నేలను తవ్వుతూ, తవ్విన వెంటనే చుట్టూ ఉండే భాగాన్ని సురక్షితంగా మూసివేస్తూ వచ్చింది. అలా ఈ మెట్రో మార్గాన్ని రెడీ చేయడం సాధ్యమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా

నీ ఫిట్‌నెస్ సూపర్‌ బ్రో… సైకిల్‌పై ఈఫిల్‌ టవర్‌ ఎక్కాడు

సెల్ఫీ తీయబోతూ.. 18 వేల అడుగుల్లో పట్టు తప్పి

హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్న లేటెస్ట్ టెక్నాలజీ..

కాసులు కురిపిస్తున్న కామెడీ జానర్‌

Exit mobile version