Site icon Desha Disha

‘అరి’కి విశేష ప్రేక్షకాదరణ

‘అరి’కి విశేష ప్రేక్షకాదరణ

ఆర్వీ సినిమాస్‌ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్‌వీ రెడ్డి) సమర్పణలో రూపొందిన చిత్రం ‘అరి’. శ్రీనివాస్‌ రామిరెడ్డి, డి.శేషురెడ్డి మారంరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్‌ రెడ్డి నిర్మించిన దీనికి లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్‌. వినోద్‌ వర్మ, అనసూయ భరద్వాజ్‌, సాయి కుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటించారు. జయశంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10వ తేదీన రిలీజై, ప్రేక్షాకదరణతో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మేకర్స్‌ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నటుడు వినోద్‌ వర్మ మాట్లాడుతూ, ‘మా సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

అరిషడ్వర్గాల నేపథ్యంలో జయశంకర్‌ సినిమా రూపొందించినప్పుడు ఇందులో ఏదో ఒక ఎమోషన్‌ ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్‌ అవుతుందని నమ్మాను. మా నమ్మకాన్ని నిజం చేస్తూ ఆడియెన్స్‌ విజయాన్ని అందించారు’ అని తెలిపారు. ‘మా సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు, మంచి రివ్యూస్‌, రేటింగ్స్‌ ఇచ్చిన మీడియా వారికి థ్యాంక్స్‌. అరిషడ్వర్గాల గురించి ఎంతోమంది గొప్పవాళ్లు చెబుతూ వచ్చారు. కానీ వాటికి పరిష్కారం చూపించలేదు. ఈ ఆలోచనతోనే ఈ చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమా కథతో త్వరలోనే పుస్తకాన్ని తీసుకొస్తున్నాం’ అని దర్శకుడు జయశంకర్‌ చెప్పారు.

The post ‘అరి’కి విశేష ప్రేక్షకాదరణ appeared first on Navatelangana.

Exit mobile version