Site icon Desha Disha

KA Paul On Trump Nobel Prize: నోబెల్ శాంతి బహుమతి నేనే వద్దన్నా.. కేఏ పాల్ మళ్లీ ఏసాడు

KA Paul On Trump Nobel Prize: నోబెల్ శాంతి బహుమతి నేనే వద్దన్నా.. కేఏ పాల్ మళ్లీ ఏసాడు

KA Paul On Trump Nobel Prize: రాజకీయాలలో కామెడీని పండించడం అందరికీ సాధ్యం కాదు. కొంతమంది మాత్రమే దానిని సాధ్యం చేయగలరు. అలాంటి వారిలో కేఏ పాల్ ముందు వరుసలో ఉంటారు. తను మాట్లాడుతున్న విషయం తర్కంతో ముడిపడి ఉండదు అని తెలిసినప్పటికీ కూడా ఆయన మాట్లాడుతూనే ఉంటారు. పక్కన ఉన్న విలేకరులు నవ్వుకుంటున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయరు. తన చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పి ముగించడం కేఏ పాల్ స్టైల్.

కేఏ పాల్ ప్రస్తుత రాజకీయాలలో భిన్నమైన వ్యక్తి. అంతర్జాతీయ నుంచి స్థానికం వరకు ప్రతి విషయం పై కూడా ఆయన మాట్లాడుతుంటారు. అనర్గళంగా ప్రసంగిస్తుంటారు. అందులో వాస్తవం ఉందా? అవాస్తవం ఉందా? అనే విషయాలను ఆయన ఏ మాత్రం పట్టించుకోరు. కాకపోతే ఆయన మాట్లాడుతున్నంత సేపు టీవీలలో చూసేవాళ్ళకు నూటికి నూరు శాతం ఎంటర్టైన్మెంట్ పక్కా. పడి పడి నవ్వడం.. రిపీటెడ్ గా ఆ వీడియోలు చూడడం కచ్చితంగా చేస్తారు. ఎందుకంటే పాలు అలా మారిపోయారు మరి. ఒకప్పుడు ఆయన నిర్వహించే శాంతి సభలకు ప్రపంచ వ్యాప్తంగా జనం వచ్చేవారు. ప్రపంచ దేశాలు అధినేతలు కేఏ పాల్ దర్శనం కోసం పడిగాపులు కాసేవారు. కానీ ఆ స్థాయిని కేఏ పాల్ తగ్గించుకున్నారు. చివరికి ఒక జోకర్ లాగా మిగిలిపోయారు.

ప్రస్తుతం నోబెల్ పీస్ బహుమతిని ఇటీవల నార్వే కమిటీ ప్రకటించింది. వెనిజులా పోరాట యోధురాలికి ఆ బహుమతిని అందజేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ట్రంప్ కు తీవ్ర నిరాశ ఎదురయింది. వాస్తవానికి నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తుందని ట్రంప్ భావించినప్పటికీ.. చివరి నిమిషంలో అది సాధ్యం కాలేదు. దీంతో ట్రంప్ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఈ శాంతి బహుమతి ఎపిసోడ్లోకి అనూహ్యంగా ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ వచ్చారు. రావడం మాత్రమే కాదు తనదైన శైలిలో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు.

గతంలోనే కేఏ పాల్ కు శాంతి బహుమతిని ప్రతిపాదిస్తూ నార్వే కమిటీ నిర్ణయం తీసుకుందట. మూడు పర్యాయాలు ఆయనకు శాంతి బహుమతి ఇస్తామని చెబితే పాల్ వద్దన్నారట. అంతేకాదు భారతరత్న అవార్డుకు కూడా బాలయోగి, ఎర్రం నాయుడు ప్రతిపాదించారట. అయితే ఆ ప్రతిపాదనను పాల్ తిరస్కరించారట. భారతదేశం రత్నం లాగా మారిపోవాలని కోరుకునే వ్యక్తిని.. తనకు ఎందుకు భారతరత్న అని పాల్ వద్దన్నారట. సరిగ్గా ఇవే విషయాలను పాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Exit mobile version