నిఖిల్ నాయర్.. సినిమాలు చూసే వారిక పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. సీరియల్స్ చూసే వారికి ఈ నటుడు బాగా పరిచయం. గృహలక్ష్మీ సీరియల్‌లో తులసి చిన్న కొడుకు ప్రేమ్‌గా నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు నిఖిల్. ఆ తర్వాత ‘పలుకే బంగారమాయెనా’ సీరియల్‌లో హీరోగా అలరించాడు. ఇక ‘దిల్ సే’ ఓటీటీ సిరీస్‌తో నూ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ క్రేజ్ , పాపులారిటీని డబుల్ చేసుకునేందుకు బిగ్ బాస్ 9 తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఈ సందర్భంగా బిగ్ బాస్ వేదికపైకి నిఖిల్ ను ఆహ్వానించి కొన్ని ప్రశ్నలు వేశారు హోస్ట్ నాగార్జున. దీనికి ఆసక్తికర సమాధానాలిచ్చాడీ బుల్లితెర హీరో.
పుట్టింది కేరళలో సెటిలైంది బెంగళూరులో. సీరియల్స్ చేస్తుంది తెలుగులో. నా కెరీర్ ని ప్రారంభించింది ఇక్కడే కాబట్టి రుణం తీర్చుకుంటాను అని నిఖిల్ అనగానే.. మరి ఇక్కడమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని నాగ్ అడిగాడు.. దీనికి ఏ మాత్రం ఆలోచించకుండా కచ్చితంగా చేసుకుంటానని ఆన్సరిచ్చాడు నిఖిల్. ఇక ప్రస్తుతం హౌస్ లో ఇమ్మాన్యుయేల్ నచ్చాడనని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా నిఖిల్ కు పింక్ స్టోన్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కోసం చాలా టాస్కులు జరుగుతుంటాయి. దీన్ని ఉపయోగించి కెప్టెన్సీ కంటెండర్ అయిపోవచ్చు అని నాగ్ నిఖిల్ కు చెప్పాడు.
ఇవి కూడా చదవండి
Calm before the chaos. Storm after the silence. 🌪️🔥#NikhilNair steps into Bigg Boss Telugu 9 to flip the game with fire and focus! 💫⚡#BiggBossFireStorm
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/llvA7JHl1Y
— Starmaa (@StarMaa) October 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.