న్యూఢిల్లీ: 1984లో నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయం అని కాంగ్రెస్, సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబ రం పేర్కొన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయాన్ని తీవ్రవాదుల కబ్జా నుంచి స్వా ధీనం చేసుకోవడానికి అప్పట్లో ఆపరేషన్ బ్లూ స్టా ర్ నిర్వహించారు. ఆ నిర్ణయానికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భారీ మూల్యం చెల్లించారని చిదంబరం వాపోయారు. ఆయితే ఆ నిర్ణయాన్ని ఇం దిర ఒక్కరే తీసుకోలేదని పేర్కొన్నారు. అది సై న్యం, పోలీసులు, నిఘావర్గాల సమిష్టి నిర్ణయం. దీనికి ఇందిరాగాంధీ ఒకరినే నిందించలేమని కేం ద్ర మాజీ మంత్రి అన్నారు.
తాను ఏ సైనిక అధికారులను తాను అగౌరవపరచడం లేదని, కానీ స్వర్ణదేవాలయం నుం చి టెర్రరిస్ట్ లను నిర్మూలించేందుకు అది తప్పుడు మార్గం అని చిదంబరం పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత సైన్యాన్ని దూరంగా ఉంచడం ద్వారా దానిని తిరిగి పొందే సరైన మార్గాన్ని తాము చూపామన్నారు. బ్లూ స్టార్ విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఇందిరాగాంధీ తన జీవితాన్నే బలి పెట్టవలసి వచ్చిందని తాను అంగీకరిస్తున్నానని చిదంబరం అన్నారు. కసౌలిలో ఒక సాహిత్య కార్యక్రమంలో ప్రసంగిస్తూ చిదంబరం ఈ ప్రకటన చేశారు.
చిదంబరం ప్రకటనను ఖండించిన కాంగ్రెస్
చిదంబరం ప్రకటనను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన ఒత్తిడిలో ఉన్నట్లు కన్పిస్తోందని, చిదంబరం ప్రకటన బిజేపీ పంథాను ప్రతిధ్వనిస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రషీద్ అల్వి ఆరోపించారు. ఆపరేషన్ బ్లూస్టార్ సరైనదా, కాదా అనేది చ ర్చనీయాంశం. కానీ, 50ఏళ్ల తర్వాత చిదంబరం కాంగ్రెస్‌ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి. ఇందిరాగాంధీ తప్పుడు అడుగు వేశారనడం ద్వారా ఆయన మోదీ మాటనే వల్లెవేస్తున్నట్లు కన్పిస్తోందని రషీద్ అల్వీ విమర్శించారు. చిదంబరంపై ఎన్నో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆయన ఏదైనా ఒత్తిడిలో ఉన్నారా అని తాను అనుమానిస్తున్నానని రషీద్ అల్వి అన్నారు.
చిదంబరం వ్యాఖ్యలను కాంగ్రెస్ వర్గాలు ఖండించాయి. పార్టీ ద్వారా ఎన్నో కీలక పదవులు అందుకున్న సీనియర్ నాయకుడు బాధ్యతతో మాట్లాడాలని, పార్టీని ఇరుకునపెట్టే ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొన్నాయి. ప్రస్తుత పంజాబ్ గురించి మాట్లాడుతూ, ఖలిస్తాన్ నినాదాలు చాలా తగ్గిపోయాయి. ఆర్థిక ఇబ్బందులే రాష్ట్రానికి ప్రధాన సమస్య అని చిదంబరం అన్నారు.
స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్
పంజాబ్‌లో తీవ్రవాద నాయకుడు జర్నేల్ సింగ్ భింద్రన్ వాలే నాయకత్వంలో వేర్పాటు వాదులను అణచి వేసేందుకు ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆద్వర్యంలో 1984 జూన్ 1నుంచి జూన్ 8వరకూ ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు. స్వర్ణదేవాలయ సముదాయం, అకాల్ తఖ్త్‌లో తలదాల్చుకున్న భింద్రన్ వాలే ఆయన అనుచరులు కాల్పులకు తెగపడడంతో సైన్యం ఆపరేషన్‌ను నిర్వహించింది. ఆపరేషన్‌లో ట్యాంక్‌లు, భారీ ఫిరంగులను కూడా ఉపయోగించాల్సివచ్చింది. వందలాదిమంది టెర్రరిస్ట్‌లు, సైనికులు, పౌరులు కూడా చనిపోయారు. సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణదేవాలయం పై దాడి సిక్కు సమాజాన్ని తీవ్రంగా బాధించింది. ఆగ్రహజ్వాలలను రేకెత్తించింది. ఈ దాడికి ప్రతీకారంగా ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు 1984 అక్టోబర్ 31న హత్య చేశారు.