బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. కత్రినా కైఫ్ ప్రస్తుతం గర్భంతో ఉంది. త్వరలో ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ప్రకటించారీ లవ్లీ కపుల్. దీంతో ఈ సెలబ్రిటీ జంటకు పలువరు ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ జ్యోతిష్యుడు కత్రినా కైఫ్ కు పుట్టబోయే బిడ్డపై జోస్యం చెప్పాడు. కత్రినా- విక్కీ కౌశల్‌కు మొదటి బిడ్డగా కూతురు పుడుతుందని అనిరుధ్ కుమార్ మిశ్రా జోస్యం చెప్పారు. దీంతో ఇది కాస్తా నెట్టింట వైరల్ లవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం కూతుళ్ల సీజన్ నడుస్తోందని, కాబట్టి కత్రినాకు కూడా కూతురే పడుతుందని ఒక నెటిజన్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. కత్రినా-విక్కీ కౌశల్ లది ప్రేమ వివాహం. వయసులో కత్రినా కంటే విక్కీ చిన్నవాడు. 2021 డిసెంబర్ నెలలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ లోని ఫోర్ట్ బార్వారా లో ఉన్న సిక్స్ సెన్సెస్ రిసార్ట్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు పెళ్లయిన నాలుగేళ్లకు ఈ జంట తల్లిదండ్రులు కానున్నారు.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కత్రినా కైఫ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. తెలుగు సినిమాలతోనే ఆమె సినీ ప్రస్థానం ప్రారంభమైంది. వెంకటేశ్ సూపర్ హిట్ సినిమా మళ్లీశ్వరిలో కత్రినా కథానాయికగా నటించింద. ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి అల్లరి పిడుగు అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిందీ అందాల తార. గర్భం ధరించడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది కత్రినా. చివరిసారిగా ఆమె 2024లో విజయ్ సేతుపతితో కలిసి ‘మేరి క్రిస్మస్’ చిత్రంలో నటించింది.
ఇవి కూడా చదవండి
అనిరుధ్ కుమార్ ట్వీట్..
The first child of Vicky Kaushal and Katrina Kaif will be a daughter. pic.twitter.com/2wjWk7SaKN
— Anirudh Kumar Mishra (Astrologer) (@Anirudh_Astro) October 8, 2025
ఇక ‘ఛావా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్కీ కౌశల్.. ప్రస్తుతం లవ్ అండ్ వార్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.