TG: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్

TG: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAs) వాకౌట్ చేశారు. సభలో తమకు సమయం ఇవ్వడం లేదని.. తాము ప్రజల దృష్టికి, సభ దృష్టికి తీసుకురావాలనుకున్నవి తీసుకురాలేకపోతున్నామని ఆందోళన చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా, అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సభలో మైక్ ఇవ్వనందుకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. భట్టి మాట్లాడుతుండగా తమకు మైక్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులకు మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Leave a Comment