Site icon Desha Disha

RRB Railway Jobs 2025: రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే లైఫ్‌ సెటిలంతే! – Telugu News | RRB Para Medical Recruitment 2025 Notification Released for 434 Various Posts, Check Details here

RRB Railway Jobs 2025: రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే లైఫ్‌ సెటిలంతే! – Telugu News | RRB Para Medical Recruitment 2025 Notification Released for 434 Various Posts, Check Details here

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB).. దేశ వ్యాప్తంగా ఉన్న రీజియన్లలో వివిధ పారా మెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 434 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, డయాలిసిస్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌-2, ఫార్మసిస్ట్‌, ఈసీజీ టెక్నీషియన్‌ వంటి పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 8, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇవే..

  • నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుల సంఖ్య: 272
  • డయాలిసిస్‌ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 4
  • హెల్త్‌ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌ 2 పోస్టుల సంఖ్య: 33
  • ఫార్మసిస్ట్‌(ఎంట్రీ గ్రేడ్‌) పోస్టుల సంఖ్య: 105
  • రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌రే టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 4
  • ఈసీజీ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 4
  • లాబోరేటరీ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల సంఖ్య: 12

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ, డిప్లొమా, టెన్‌+2 లేదా ఫార్మసి, రేడియోగ్రఫిలో డిప్లొమా, డిగ్రీ, డీఎంఎల్‌టీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026వ తేదీ నాటికి నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు 20 నుంచి 40 ఏళ్లు, డయాలిసిస్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 20 నుంచి 33 ఏళ్లు, హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, ఫార్మసిస్ట్‌ పోస్టులకు 20 నుంచి 35 ఏళ్లు, రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌-రే టెక్నీషియన్‌ పోస్టులకు 19 నుంచి 33 ఏళ్లు, ఈసీజీ టెక్నీషియన్‌ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, లాబోరేటరీ అసిస్టెంట్‌ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 8, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 11 నుంచి 20 వరకు దరఖాస్తు సవరణకు అవకాశం ఇస్తారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు నర్సింగ్‌ సూపరింటెండెంట్‌కు రూ.44,900, డయాలిసిస్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ అండః మలేరియా ఇన్‌స్పెక్టర్‌కు రూ.35,400, ఫార్మసిస్ట్‌, రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌-రే టెక్నీషియన్‌కు రూ.29,200, ఈసీజీ టెక్నీషియన్‌కు రూ.25,500, లాబోరేటరీ అసిస్టెంట్‌కు రూ.21,700 చొప్పున జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Exit mobile version