Site icon Desha Disha

Dogs Population: కుక్కల ప్రేమికులా..! ప్రపంచంలో ఏ దేశంలో కుక్కలంటే ఎక్కువ మక్కువ? మన దేశం ఏ స్థానంలో ఉందంటే – Telugu News | Population of dogs: 10 countries with most dogs in the world, know India stands on the list

Dogs Population: కుక్కల ప్రేమికులా..! ప్రపంచంలో ఏ దేశంలో కుక్కలంటే ఎక్కువ మక్కువ? మన దేశం ఏ స్థానంలో ఉందంటే – Telugu News | Population of dogs: 10 countries with most dogs in the world, know India stands on the list

కుక్కలు, మనుషులకు మధ్య విడదీయని బంధం ఉంది. అత్యంత విశ్వాసం గల కుక్క పెంపుడు జంతువులలో ప్రధమ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఎందుకంటే కుక్కలు మనుషుల భావోద్వేగాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాయి.. అవసరాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. కుక్కలను తమ ఇంటి సభ్యుల్లా పెంచుకునేవారు.. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా కనిపిస్తూనే ఉంటారు. కుక్కలను మనిషికి ప్రాణ స్నేహితుడని చెప్పవచ్చు,. ఇంట్లో మాత్రమే కాదు వీధుల్లో కూడా కుక్కలు భారీ సంఖ్యలో కనిపిస్తాయి. గ్రామాలు, పట్టణాలు, నగర అపార్ట్‌మెంట్ ఇలా ఎక్కడైనా తమ ఉనికిని చాతుకుంటాయి. కొన్ని దేశాలలో కుక్కలను సొంత ఇంటి సభ్యుల్లా భావించి ప్రేమిస్తారు. మరికొన్ని చోట్ల వీధుల్లో కుక్కలసంఖ్య పెరగడం ప్రభుత్వానికి, సమాజానికి సవాలుగా మారుతోంది. అయితే ఈ రోజు కుక్కల జనాభా గణాంకాల ప్రకారం
ప్రపంచంలోని కుక్కల సంఖ్య అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాలు ఏమిటంటే..

  1. అమెరికా: అగ్రరాజ్యం అమెరికా కుక్కలా జనాభా గణాంకాల ప్రకారం కుక్కలు జనాభాలో కూడా అగ్రస్థానంలో ఉంది. దాదాపు 75.8 మిలియన్ల కుక్కలు ఉన్నాయి. అమెరికాలో ప్రత్యేక డాగ్ పార్కులు, గ్రూమింగ్ సెంటర్లు, పెంపుడు జంతువుల సంరక్షణ కోసం కఠినమైన జంతు సంరక్షణ చట్టాలు ఉన్నాయి. జంతు హింస కేసులపై కఠినమైన చర్యలు తీసుకుంటారు. దోషులుగా తేలితే తదుపరి శిక్షలు విధించబడతాయి
  2. బ్రెజిల్: యురోపిన్ దేశం అయిన బ్రెజిల్‌లో దాదాపు 35.7 మిలియన్ల కుక్కలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు సగం ఇళ్లలో కనీసం ఒక పెంపుడు కుక్క అయినా ఉంటుంది. పెంపుడు కుక్కలకు టీకాలు వేయడం, కుక్కల సంరక్షణ కోసం ప్రభుత్వం పరిష్టమైన ఏర్పాటు చేసింది.
  3. చైనా: డ్రాగన్ కంట్రీలో కూడా 2.74 కోట్ల కుక్కలు ఉన్నాయి. 1980లలో బీజింగ్‌లో పెంపుడు కుక్కను కలిగి ఉండటం పాశ్చాత్య జీవనశైలికి అనుకరణగా పరిగణించబడింది. అందువల్ల కొన్ని నగరాల్లో కుక్కలను పెంచుకోవడంపై నిషేధం ఉండేది. అయితే ఇప్పుడు సమాజంలో ఆలోచన తీరు మారుతోంది. ప్రజల్లో కుక్కలను పెంచుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. ఫలితంగా చైనాలో పెంపుడు కుక్కల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది.
  4. రష్యా: ఈ దేశంలో కూడా దాదాపు 1.5 కోట్ల కుక్కలు ఉన్నాయి. ఇక్కడ వీధి కుక్కలను ‘మెట్రో కుక్కలు’ అని కూడా పిలుస్తారు. ఇవి రైళ్లు, బస్సులలో ప్రయాణించడం నేర్చుకున్నాయి. ప్రభుత్వం, సామాన్య ప్రజలు కలిసి వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. రష్యాలోని వీధి కుక్కలు పురాతన రష్యన్ ప్యాక్‌ల వారసులు అని పరిశోధకులు విశ్వసిస్తారు.
  5. జపాన్: జపాన్‌లో దాదాపు 12 మిలియన్ల కుక్కలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది పెంపుడు కుక్కలను పిల్లలకు బదులుగా కుటుంబంలో భాగంగా భావిస్తారు. అందుకే జపాన్ పెంపుడు జంతువుల పరిశ్రమ విలువ $10 బిలియన్లకు పైగా ఉంది. జపాన్‌లో పెంపుడు జంతువుల జనాభా దేశంలోని పిల్లల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది
  6. ఫిలిప్పీన్స్: ఫిలిప్పీన్స్‌లో కుక్కల సంఖ్య 11.6 మిలియన్లు. చాలా కాలంగా రాబిస్ కారణంగా మరణాలు ఆ దేశంలో ఆందోళన కలిగించింది. ఇప్పుడు ప్రభుత్వం కుక్కలను చంపడానికి బదులుగా టీకాలు వేయడం, స్టెరిలైజేషన్‌ను ఆశ్రయిస్తోంది.
  7. భారతదేశం: మన దేశంలో దాదాపు 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయి. ఈ సంఖ్య దేశానికి పెద్ద సవాలు. ఒక సంవత్సరం లోపు 70% కుక్కలకు టీకాలు వేసి, స్టెరిలైజేషన్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, తద్వారా వాటి సంఖ్యను నియంత్రించవచ్చు. ప్రజలు భద్రతగా సంచరించే అవకాశాన్ని కల్పించవచ్చు అని భావిస్తున్నారు. 1995 నుంచి 2014 మధ్య వీధి కుక్కల జనాభా కూడా దాదాపు 50% తగ్గింది
  8. అర్జెంటీనా: అర్జెంటీనాలో దాదాపు 9.2 మిలియన్ల కుక్కలు ఉన్నాయి. ఆ దేశ ప్రజలు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నప్పటికీ పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడతారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు టీకాలు , స్టెరిలైజేషన్ ప్రచారాలను నిర్వహించడం ద్వారా కుక్కల సంఖ్యను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. పూడ్లేస్, లాబ్రడార్స్, జర్మన్ షెపర్డ్‌లు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జాతులు
  9. ఫ్రాన్స్: ఫ్రాన్స్‌లో దాదాపు 7.4 మిలియన్ల కుక్కలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి పెంపుడు కుక్కకు మైక్రోచిప్ వేసి టీకాలు వేస్తారు. అందుకే ఈ దేశంలో రాబిస్ కేసులు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఫ్రెంచ్ వారు కుక్క ప్రేమికులు అయినప్పటికీ… ప్రతి సంవత్సరం దాదాపు 100,000 కుక్కలను వాటి యజమానులు వదిలివేస్తున్నారు. వాటిలో చాలా వరకు స్థానిక పౌండ్లకు తరలించి చంపేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం దాదాపు 60,000 కుక్కలు, ముఖ్యంగా అధిక విలువైన జాతుల కుక్కలు దొంగిలించబడుతున్నాయి.
  10. రొమేనియా: ఈ దేశంలో కుక్కల సంఖ్య దాదాపు 41 లక్షలు. 1980లలో ప్రజలు గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్ళినప్పుడు.. చాలా కుక్కలు వీధిల్లో విడిచి పెట్టబడ్డాయి. క్రమంగా వీధి కుక్కల సంఖ్య పెరిగింది. ఎంతగా అంటే రొమేనియా వీధులు ఈ నిరాశ్రయులైన కుక్కలతో నిండిపోయాయి. వీటిని సంఖ్యను నియంత్రించడానికి సామూహికంగా వధించేవారు. అయితే జంతు హక్కుల సంస్థల నిరసన తర్వాత, దీనిని ఆపవలసి వచ్చింది. రొమేనియాలో కుక్కలను చంపడం విదేశీ ప్రభుత్వాలు కూడా విమర్శలు చేశాయి. మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version