Site icon Desha Disha

సుమ కొడుకు…మంచి కంటెంట్ తోనే దిగాడుగగా…

సుమ కొడుకు…మంచి కంటెంట్ తోనే దిగాడుగగా…

The World Of Mowgli Glimpse: టెలివిజన్ రంగంలో యాంకర్ గా మంచి పాపులారిటీని సంపాదించుకున్న సుమ కనకాల…అలాగే సినిమా ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీ ని దక్కించుకున్న నటుడు రాజీవ్ కనకాల…వీళ్ళిద్దరి కొడుకు అయిన రోషన్ కనకాల హీరోగా మారిన విషయం మనకు తెలిసిందే… బబుల్గం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో ‘మోగ్లీ’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ గా తెరకెక్కుతోంది… ఇక నిన్న ఈ సినిమా నుంచి గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. నాని వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. అడవి ప్రాంతంలో ఉంటున్న మోగ్లీ అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆమె కోసం ఎక్కడ దాకా వెళ్తాడు అనే విషయాన్ని హైలెట్ చేసి ఈ సినిమాలో చూపించబోతున్నారు… ఇక ఈ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ అనే క్యారెక్టర్ లో యూట్యూబ్ స్టార్ అయిన బండి సరోజ్ కుమార్ నడుస్తుండడం విశేషం… నిర్బంధం, మాంగల్యం,పరాక్రమం లాంటి సినిమాలతో చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఆయన క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా నిల్వబోతున్నట్టుగా తెలుస్తోంది…

Also Read: బీసీసీఐ అధ్యక్షుడు ఎందుకు రాజీనామా చేశాడు? అసలేం జరిగింది?

తన సీన్స్ ను కూడా ఎలివేట్ చేస్తూ చూపించడంతో బండిసరేజ్ కుమార్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మనకు ఈజీగా అర్థమైపోతోంది… ఇక మొదటి నుంచి ఈ సినిమాలో ఏముంటుంది అని కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ గ్లింప్స్ తో సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేశారు.

తెలుగులో ఒక ప్యూర్ లవ్ స్టోరీ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అలాంటి సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దర్శకుడు సందీప్ రాజ్ ఇంతక ముందు కలర్ ఫొటో సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

మరి ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో లవ్ స్టోరీ కి సంబంధించిన సోల్ నైతే చాలా బాగా పరిచయం చేశారు. మరి దాన్ని మొదటి నుంచి చివరి వరకు ఎలాంటి డివియేషన్స్ లేకుండా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినట్లయితే సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మొత్తానికైతే రాజీవ్ – సుమ లా కొడుకు అయిన రోషన్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది….

 

The World of Mowgli (Glimpse) | Roshan Kanakala | Sandeep Raj | Bandi Saroj Kumar | TG Vishwa Prasad

Exit mobile version