Site icon Desha Disha

మోహన్ బాబు తో మహేష్ బాబు వదిన సినిమా…

మోహన్ బాబు తో మహేష్ బాబు వదిన సినిమా…

Shilpa Shirodkar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న హీరో మహేష్ బాబు… ప్రస్తుతం ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమాతో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పూర్తి కసరత్తులను చేస్తూ ముందూ సాగుతున్నాడు. దానికి తోడుగా ఈ సినిమాతో ఆయన ఒక పెను సంచలనాన్ని సృష్టించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ గొప్ప గుర్తింపుని సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి వాళ్ల నాన్న పేరు ను కేవలం ఎంట్రీ పాస్ గా వాడుకున్న ఆయన ఆ తర్వాత తన స్వసక్తితో తన టాలెంట్ ని ఉపయోగించి మాస్ హీరోగా ఎదగడమే కాకుండా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరాభిమానాలను అందుకున్నాడు.

Also Read: బీసీసీఐ అధ్యక్షుడు ఎందుకు రాజీనామా చేశాడు? అసలేం జరిగింది?

ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మహేష్ బాబు భార్య అయిన నమ్రత శిరోడ్కర్ యొక్క అక్క అయిన శిల్పా శిరోడ్కర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబుతో కలిసి ఒక సినిమా చేసింది.

ఒక బ్రహ్మ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలైతే చేయలేకపోయింది. బ్రహ్మ సినిమా సక్సెస్ అయినప్పటికి ఆమె పెద్దగా తెలుగులో క్లిక్ అవ్వలేకపోయింది. మరి ఏది ఏమైనా కూడా ఆమె తన చెల్లి అయిన నమ్రత శిరోడ్కర్ మహేష్ బాబును పెళ్లి చేసుకోవడంతో ఆమె హైదరాబాద్ కి వస్తూ వెళ్తూ ఉంటుంది తప్ప ఆమె సినిమాల్లో మాత్రం ఇప్పుడు పెద్దగా నటించడం లేదు.

ఇక ఇప్పుడు ఒక బాలీవుడ్ సినిమాలో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఆమె చేయబోయే సినిమా ఏంటి అనే విషయంలో అయితే సరైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే మరోసారి ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…

Exit mobile version