– Advertisement –
నవతెలంగాణ-హైదరాబాద్ : టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు భారీ ఎదురుదెబ్బ. ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్‌లను పెంచినట్లు పేర్కొంది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని యూఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది. అప్పీల్ల కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టులో పోరాడనున్నారు.
– Advertisement –