Site icon Desha Disha

ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉర్జిత్‌ పటేల్‌

ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉర్జిత్‌ పటేల్‌

– Advertisement –

న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా ఆర్బీఐ మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నియమితులయ్యారు. కె సుబ్రమణియన్‌ స్థానంలో నియమితులైన ఆయన భారత్‌తో పాటు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, భూటాన్‌, శ్రీలంకలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఐఎంఎఫ్‌ వర్గాలు వెల్లడించాయి. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి అర్థ శాస్త్రంలో డిగ్రీ, ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్‌, యేల్‌ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన పటేల్‌ 1990వ దశకం ప్రారంభంలో ఐఎంఎఫ్‌లో పని చేశారు. 2016 సెప్టెంబర్‌లో రఘురామ్‌ రాజన్‌ స్థానంలో ఉర్జిత్‌ ఆర్బీఐ 24వ గవర్నర్‌గా నియమితులయ్యారు. సెంట్రల్‌ బ్యాంక్‌ స్వయం ప్రతిపత్తి, మిగులు నిల్వలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంతో బహిరంగ వివాదం తలెత్తడంతో వ్యక్తిగత కారణాలను చూపుతూ 2018 డిసెంబరులో ఆయన రాజీనామా చేశారు. కాగా.. ఐఎంఎఫ్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉర్జిత్‌ నియామకానికి కేంద్రం ఆమోదం తెలపడం విశేషం.

– Advertisement –

Exit mobile version