Site icon Desha Disha

Watch: కోటి లింగాలతో గణేశుడి విగ్రహం.. దర్శించిన వారికి విఘ్నాలు తొలగి, ఐశ్వర్యాలు కలిగిస్తాడట..!

Watch: కోటి లింగాలతో గణేశుడి విగ్రహం.. దర్శించిన వారికి విఘ్నాలు తొలగి, ఐశ్వర్యాలు కలిగిస్తాడట..!
Watch: కోటి లింగాలతో గణేశుడి విగ్రహం.. దర్శించిన వారికి విఘ్నాలు తొలగి, ఐశ్వర్యాలు కలిగిస్తాడట..!

దేశవ్యాప్తంగా గణేష్‌ నవరాత్రులు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడా, పల్లే పట్నం తేడా లేకుండా భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని చోట్ల పండ్లతో చేసిన వినాయక విగ్రహాలు భక్తుల్ని మురిపిస్తుంటే.. మరికొన్ని చోట్ల నాణేలు, నెమలి పింఛాలు, కొబ్బరి చిప్పలు, బెల్లం, చాకెట్లతో ఏర్పాటు చేసిన లంబోదరుడు ఆకట్టుకుంటున్నాడు. వినాయక ఉత్సవాల్లో భాగంగా విశాఖలో కూడా భారీ గణనాధులు పోటాపోటీగా కొలుదీరారు. విశాఖ గాజువాకలో ఏర్పాటు చేసిన శివలింగాల నిర్మిత గణేశుడు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.

వీడియో ఇక్కడ చూడండి..

128 అడుగుల కోటి లింగాలతో గణేశుడి విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం భక్తుల ఆరాధనకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. కోటి లింగాల గణపతిని దర్శించుకోవడం ద్వారా అన్ని విఘ్నాలు తొలగి, ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రజలు విశ్వసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Exit mobile version