రెండు సింహాలు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? నెట్టింట వైరల్ అవుతున్న ఈ సింహాల కొట్లాటను చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అడవి మొత్తం దద్దరిల్లేలా గర్జిస్తూ హోరాహోరీ తలపడ్డాయి. అసలు రెండు సింహాలు కొట్టుకోవడం అనే ఊహనే ఎంతో భయంకరంగా ఉంటుంది. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో రెండు సింహాల మధ్య ఆధిపత్యం కోసం జరిగే యుద్ధాన్ని చూపిస్తుంది. ఇది ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది.
ఈ దృశ్యం దక్షిణాఫ్రికాలోని మాడిక్వే గేమ్ రిజర్వ్ నుండి వచ్చింది. దీనిని ఫోటోగ్రాఫర్ టెబాట్సో రోజ్ టెమా తన కెమెరాలో బంధించారు. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన సింహాలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నట్లు చూడవచ్చు. రెండూ ఎత్తులో చాలా బలంగా ఉన్నాయి, దీని వలన ఎవరు గెలుస్తారో ఊహించడం కష్టం.
దాదాపు 45 సెకన్ల పాటు జరిగిన ఈ పోరాటంలో రెండూ ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి. ఒక చోట, ఒక సింహం మరొకదాన్ని పడగొడుతుంది. కానీ మరొకటి ఓడిపోవడానికి సిద్దంగా లేదు. తన శక్తివంతమైన గోళ్లతో ప్రత్యర్థి సింహంపై దాడి చేస్తుంది. మొత్తంమీద ఈ భీకర పోరాటంలో ఎవరూ ఓడేట్టు కనిపించపోయే సరికి కోట్లాట ఆపేసి వేర్వేరు మార్గాల్లో వెళ్లిపోతాయి.
వీడియో చూడండి:
ఈ వీడియో చాలా ఉత్తేజకరమైనది. ఇప్పటివరకు 50 లక్షలకు మందికి పైగా వీక్షించారు. నెటిజన్స్ ఆశ్చర్యంగా తమ ప్రతిస్పందనలను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. రెండు గ్రహాలు ఒకదానికొకటి ఢీకొంటున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.