Site icon Desha Disha

Telangana Assembly: దుమ్ము దుమారమే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. మొత్తం ఎన్ని రోజులంటే.. – Telugu News | Telangana Assembly Monsoon Session to Begin on August 30, Kaleshwaram Report, BC Reservations Dominate Debate

Telangana Assembly: దుమ్ము దుమారమే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. మొత్తం ఎన్ని రోజులంటే.. – Telugu News | Telangana Assembly Monsoon Session to Begin on August 30, Kaleshwaram Report, BC Reservations Dominate Debate

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తామంటోంది ప్రభుత్వం. నివేదికపై సుదీర్ఘంగా చర్చించి బీఆర్ఎస్‌ను కేసీఆర్, హరీష్‌రావును దోషులుగా నిలబెట్టాలని భావిస్తోంది.

కాళేశ్వరం నివేదికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పన, యూరియా కొరత, ఓట్‌ చోరీ అంశాలపై బీజేపీని కార్నర్ చేసేందుకు స్కెచ్‌ గీసింది అధికార పార్టీ. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే కీలక ప్రకటన చేసే అవకాశముంది.

మరోవైపు ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 665 పేజీల రిపోర్ట్‌ను సభలో ప్రవేశపెట్టాకే చర్చ మొదలుపెట్టాలని డిమాండ్‌ చేస్తోంది బీఆర్ఎస్. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు అనుమతించాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరింది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ వేదికగా కాళేశ్వరంపై జరుగుతున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు..

అప్పుల అంశంతో పాటు ఎరువులపైనా ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఎరువుల కొరతకు ప్రభుత్వ అసమర్థతే కారణమన్న విషయాన్ని సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు హరీష్‌ రావు.

అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు. కాంగ్రెస్ ఆరుగ్యారంటీలపై నిలదీయాలన్నారు. కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయనున్నారు బీజేపీ నేతలు. ముస్లిం రిజర్వేషన్‌ తొలగించి బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సభలో పట్టుబడతామన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు..

ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలపై చర్చించేందుకు 10 రోజులపైనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తామంటున్నాయి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు.. అయితే.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version